Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇవి తింటే.. బోలెడన్నీ లాభాలు

పరగడుపున లవంగాలను తినడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే నోటి దుర్వాసన తగ్గడం, రోగనిరోధక శక్తి పెరగడం, దంత సమస్యలు తగ్గుతాయట. కాబట్టి లవంగాలను డైలీ డైట్‌లో యాడ్ చేసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

New Update
teeth6

Health Tips

వంటింట్లో ఉండే మసాలా దినుసులతో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని నిపుణులు అంటున్నారు. మసాలా దినుసుల్లో లవంగాల గురించి అందరికీ తెలిసిందే. చిన్నగా నల్లగా ఉండే వీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో విటమిన్లు, ఫైబర్, ప్రొటీన్లు, ఐరన్, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, మాంగనీస్, కార్బోహైడ్రేట్లు,యాంటీ ఆక్సిడెంట్లు అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడతాయి. 

ఇది కూడా చూడండి: HOROSCOPE TODAY: నేడు ఈ రాశివారికి ధనలాభం..ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే

రోగనిరోధక శక్తి పెరుగుదల

లవంగాలను ఉదయాన్నే నమలడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా ఉంటాయి. చలికాలంలో చల్లని గాలుల వల్ల కొందరు ఇన్ఫెక్షన్ల బారిన పడతారు. అదే వీటిని తింటే ఎలాంటి సమస్యలు ఉండవు. 

కాలేయ ఆరోగ్యం

లవంగాల వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో కాలేయం ముఖ్యమైన అవయవం. ఇది సక్రమంగా పనిచేస్తేనే జీవించగలరు. కాబట్టి డైలీ ఒక లవంగం అయిన తినడం అలవాటు చేసుకోండి. 

ఇది కూడా చూడండి:  KTR : ఇవాళ ఏసీబీ, రేపు ఈడీ.. కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

నోటి దుర్వాసన క్లియర్

కొందరు ఎంత మంచిగా బ్రష్ చేసిన కూడా దుర్వాసన అనేది తప్పదు. ఇలాంటి వారు లవంగాలను తినడం వల్ల నోటి దుర్వాసన ఈజీగా పోతుందని నిపుణులు అంటున్నారు. మౌత్ ఫ్రెషనర్‌ను వాడే బదులు లవంగాలను తింటే సమస్య క్లియర్ అవుతుంది. లవంగాలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిలోని సూక్ష్మక్రిములను నశింపజేస్తాయి. 

ఇది కూడా చూడండి:  కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పరీక్షలు వాయిదా

పంటినొప్పి తగ్గుదల

లవంగాలను నమలడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది. లవంగాన్ని పంటి దగ్గర పెడితే నొప్పి నుంచి  ఉపశమనం కలుగుతుంది. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు