/rtv/media/media_files/2025/10/01/shami-tree-2025-10-01-15-31-37.jpg)
shami tree
తెలంగాణ ప్రజలు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండగల్లో దసరా పండగ(Dasara 2025) ఒకటి. పండక్కి తొమ్మిది రోజుల ముందు నుంచే బతుకమ్మ వేడుకలతో దసరా సంబరాలు మొదలవుతాయి. నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఎంగిలిపూల బతుకమ్మ మొదలై సద్దుల బతుకమ్మతో.. బతుకమ్మ వేడుకలు ముగుస్తాయి. సద్దుల బతుకమ్మ(Saddula Bathukamma 2025) మరుసటి రోజు తర్వాత దసరా పండగ జరుపుకుంటారు. ఈ ఏడాది మంగళవారం రోజున తెలంగాణ వ్యాప్తంగా దసరా పండుగ జరుపుకోనున్నారు.
దసరా రోజున ఉదయం ఇంట్లో పూజలు చేసుకున్న తర్వాత.. సాయంత్రం ఊరంతా కలిసి జమ్మిచెట్టు(vijayadashami shami tree pooja) దగ్గరకి వెళ్తారు. అక్కడ చెట్టుకు పూజలు నిర్వహించి.. ఆ చెట్టు ఆకులను బంగారంలా పంచుకోవడం ఎప్పటినుంచో ఉన్న సంప్రదాయం. ఒకరికొకరు జమ్మి ఆకులను చేతిలో పెట్టుకొని అలయ్- బలయ్ చెప్పుకొని ఆలింగనం చేసుకుంటారు. అలాగే చిన్నవారు పెద్దలు చేతులో జమ్మి పెట్టి ఆశీర్వాదాలు తీసుకుంటారు. అయితే దసరా రోజు జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారో తెలుసా? జమ్మి చెట్టును పూజించడం వల్ల కలిగే శుభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read : ఓరి నాయనో.. అధికంగా వాటర్ తాగితే పైకి పోవడం గ్యారెంటీ!
ఎందుకు పూజిస్తారు
జమ్మిచెట్టును పూజించడం లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందని పురాణాలలో చెబుతుంటారు. అందుకే జమ్మి ఆకులను బంగారంలా భావించి ఒకరికొకరు పంచుకుంటారు. అలాగే ఇంట్లోని పూజ గదిలో, డబ్బుల పెట్టెలో జమ్మి ఆకులను ఉంచడం వల్ల ధనవృద్ధి జరుగుతుందని విశ్వాసం.
కొన్ని పురాణాల ప్రకారం.. జమ్మి చెట్టును దుర్గాదేవి మరొక రూపంగా చెబుతారు. కావున దసరా రోజున జమ్మి చెట్టును పూజించడం వల్ల.. కష్టాలు తొలగిపోయి.. విజయం, శుభాలు కలుగుతాయని నమ్ముతారు.
దేవతలకు, రాక్షసులకు మధ్య జరిగిన క్షీరసాగర మధనంలో కల్పవృక్షంతో పాటు మరికొన్ని దేవతా వృక్షాలు కూడా పుట్టాయని చెబుతారు. వాటిలో జమ్మి చెట్టు కూడా ఒకటని చెబుతారు.
జమ్మి చెట్టును పూజించడం వెనుక పురాణ కథలు కూడా ఉన్నాయి.. మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు, తమ శక్తివంతమైన ఆయుధాలను ఒక మూటకట్టి ఈ జమ్మి చెట్టుపై ఉంచి వెళ్లారట. అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత.. ఆ జమ్మి చెట్టుకు పూజ చేసి తిరిగి తమ ఆయుధాలను తీసుకున్నారు. ఆ తర్వాత జరిగిన పాండవులు, కౌరవుల యుద్ధంలో కౌరవులపై విజయం సాధించారు. అప్పటి నుంచి విజయదశమి నాడు జమ్మి చెట్టును పూజించడం సంప్రదాయంగా వస్తోంది.
Also Read: Loneliness: ఒంటరితనంతో జాగ్రత్త! రోజుకు 15 సిగరెట్లు తాగినంత ప్రమాదం.. షాకింగ్ రిపోర్ట్!