Loneliness: ఒంటరితనంతో జాగ్రత్త! రోజుకు 15 సిగరెట్లు తాగినంత ప్రమాదం.. షాకింగ్ రిపోర్ట్!

ఒంటరితనం రోజుకు 15 సిగరెట్లు తాగేంత ప్రమాదకరం. ఇది గుండెజబ్బులు, డిప్రెషన్, ఆత్మహత్య, అల్జీమర్స్ వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కోవిడ్, సోషల్ మీడియా ప్రభావంతో ఒంటరితనం పెరిగింది. దీన్ని తగ్గించడం అత్యంత అవసరం.

New Update
Loneliness Solution

Loneliness

Loneliness: మనలో చాలా మంది ఒంటరితనాన్ని ఒక సాధారణ భావోద్వేగంగా భావిస్తారు. కానీ వైద్య నిపుణుల ప్రకారం, దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందట. ఒంటరితనం కేవలం మానసిక స్థితిగతులనే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఘోరంగా దెబ్బతీస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం, దీర్ఘకాలికంగా ఒంటరితనంతో జీవించే వారికి త్వరగా మరణించే ప్రమాదం 30 శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది రోజుకు 15 సిగరెట్లు తాగినంత ప్రమాదంతో సమానమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కోవిడ్-19 మహమ్మారి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా మంది సామాజికంగా విడిపోతూ ఒంటరితనాన్ని అనుభవించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా దీనిని గమనించి, దీర్ఘకాలిక ఒంటరితనం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపింది.

సోషల్ మీడియా కూడా దీనికి ప్రధాన కారణాలలో ఒకటి. నిజమైన వ్యక్తిగత సంబంధాలను ఏర్పరచుకోకుండా, యువతలో చాలామంది డిజిటల్ ప్రపంచంలోనే బంధాలను ఏర్పర్చుకుంటూ ఒంటరితనానికి లోనవుతున్నారు.

ఒంటరితనం అంటే ఏమిటి?

ఒంటరితనం అనేది ప్రతి ఒక్కరికీ భిన్నంగా అనిపించే భావన. దీని వల్ల ఒంటరిగా ఉండటమే కాదు, ఇతరుల మధ్య ఉన్నా కూడా ఒంటరిగా అనిపించడమే అసలు సమస్య. ఉదాహరణకి, ఒక కళాశాల విద్యార్థి రూమ్మేట్లతో ఉన్నా ఒంటరిగా ఫీలవవచ్చు. ఒక సైనికుడు ఇతరుల మధ్య ఉన్నా, దేశం విడిచిపోయి వేరే ప్రదేశంలో ఒంటరితనాన్ని అనుభవించవచ్చు.

  • ఒంటరితనం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు.. 
  • ఒంటరితనం వల్ల శరీరానికి, మనసుకి కలిగే నష్టాలు ఇలా ఉంటాయి.. 
  • అల్జీమర్స్ పెరగడం
  • గుండె సంబంధిత వ్యాధులు
  • మెమొరీ తగ్గిపోవడం
  • మానసిక ఒత్తిడి
  • మానసిక రుగ్మతలు (డిప్రెషన్, ఆత్మహత్య ఆలోచనలు)
  • డ్రగ్స్, ఆల్కహాల్‌ అడిక్షన్
  • తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం
  • మానసిక స్థిరత్వం కోల్పోవడం

ఒంటరితనాన్ని ఎలా దూరం పెట్టాలి?

నిపుణుల ప్రకారం, ఒంటరితనాన్ని జయించడానికి మానసికంగా ముందడుగు వేయాలి. అందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి.. 

మీకు ఇష్టమైన కార్యక్రమాల్లో పాల్గొనండి ఇది కొత్త స్నేహాలు ఏర్పడడానికి మంచి అవకాశం. నెగటివ్ ఫీలింగ్స్‌కు బదులు, పాజిటివ్ ఆలోచనలు పెంచుకోండి మీరు జరగని వాటి గురించి భయపడకుండా ముందు వెళ్లాలి. అంతర్లీన సంబంధాలను బలపరచండి.. స్నేహితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడండి. ఒంటరితన ప్రభావాన్ని గుర్తించండి.. దీనివల్ల కలిగే శారీరక, మానసిక లక్షణాలను గుర్తించి ముందుగానే పరిష్కరించండి. నమ్మకమైన వ్యక్తితో మాట్లాడండి.. మీరు నమ్మిన వ్యక్తి, డాక్టర్ లేదా కౌన్సిలర్‌తో మీ మనసులోని భావాలను పంచుకోండి. 

ఒంటరితనం చిన్న సమస్య కాదు. దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తే, అది మన ఆరోగ్యాన్ని మెల్లగా నాశనం చేస్తోంది. అందుకే, నిజమైన సంబంధాలను పెంపొందించుకోవడం, మంచి మానసిక స్థితిని కాపాడుకోవడం, అత్యంత అవసరం. ప్రేమ, సంబంధాలు, పరస్పర బంధాలు ఇవే ఒంటరితనానికి మెడిసిన్. 

Advertisment
తాజా కథనాలు