/rtv/media/media_files/2025/10/20/fake-sweets-diwali-2025-10-20-14-16-43.jpg)
fake sweets Diwali
పావళి పండుగ సందర్భంగా తీపి పదార్థాల విక్రయాలు జోరుగా సాగుతున్న తరుణంలో.. మార్కెట్‌లో కల్తీ స్వీట్లు (Adulterated Sweets) పెరిగిపోతున్నాయి. కల్తీ తినుబండారాలు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసి, ఫుడ్ పాయిజనింగ్ నుండి కాలేయం, మూత్రపిండాల సమస్యలకు దారితీయవచ్చు. అందుకే పండుగ వేళ కల్తీ స్వీట్లను గుర్తించేందుకు ఈ సులభ పద్ధతులు పాటించడం ముఖ్యం. దీపావళి స్వీట్లలో కల్తీని గుర్తించడం ఎలానో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
కల్తీ స్వీట్లను గుర్తించేందుకు చిట్కాలు:
స్వీట్ మెరుపును తనిఖీ: స్వీట్లపై వెండి రేకు (Silver Varak) అతిగా మెరుస్తుంటే అది కల్తీ అల్యూమినియం రేకు అయ్యే అవకాశం ఉంది. అసలు వెండి రేకు తాకగానే అంటుకుని కరిగిపోతుంది. కానీ నకిలీ రేకు కొద్దిగా గట్టిగా ఉండి సులభంగా విడిపోదు. ఈ నకిలీ రేకు కిడ్నీలకు హాని కలిగించవచ్చు.
కోవానాణ్యత: కోవాతో చేసిన స్వీట్లలో కల్తీ ఎక్కువగా జరుగుతుంది. నిజమైన కోవాను వేలితో రుద్దితే కొద్దిగా జిడ్డుగా ఉండి పాల సువాసన వస్తుంది. నకిలీ కోవా దుర్వాసనతోపాటు కొద్దిగా గరుకుగా లేదా రబ్బరులా అనిపించవచ్చు. కల్తీ కోవా తింటే కడుపునొప్పి, వాంతులు వచ్చే ప్రమాదం ఉంది.
ఇది కూడా చదవండి: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం దీపావళికి ఈ మొక్కను నాటండి.. అమ్మవారి కృపా కటాక్షాలను పొందండి!!
రంగుపై దృష్టి: స్వీట్ల రంగు చాలా ముదురుగా, అసహజంగా, కృత్రిమంగా ప్రకాశవంతంగా ఉంటే సింథటిక్ రంగులు కలిపినట్లు అనుమానించాలి. పసుపు, నారింజ, పింక్ రంగు స్వీట్లలో ఈ ప్రమాదం ఎక్కువ. చిన్న ముక్కను నీటిలో ముంచి చూడండి. రంగు కరిగితే కల్తీ ఉన్నట్లే.
వాసన- రుచి: అసలైన స్వీట్లలో పాలు, నెయ్యి, కుంకుమపువ్వు వంటి పదార్థాల నుంచి వచ్చే తేలికపాటి సువాసన ఉంటుంది. స్వీట్లకు బలమైన, అసహజమైన వాసన ఉంటే ఆర్టిఫిషియల్ ఎసెన్స్‌లు కలిపినట్లు అర్థం. రుచి కూడా అతిగా తీయగా లేదా అసాధారణంగా అనిపిస్తే జాగ్రత్త వహించాలి
దుకాణదారుడి తనిఖీ: స్వీట్లు కొనేటప్పుడు దుకాణం పేరు, గుర్తింపును (Credibility) తప్పకుండా తనిఖీ చేయాలి. ఆ దుకాణంలో FSSAI సర్టిఫికెట్ ప్రదర్శించబడిందో లేదో చూసుకోవాలి. నమ్మకమైన బ్రాండ్ల నుంచి లేదా సుప్రసిద్ధ స్థానిక తయారీదారుల నుంచి మాత్రమే స్వీట్లు కొనడం సురక్షితమని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: దీపావళి లక్ష్మీపూజకు ఈ రంగు దుస్తులు ధరిస్తే అమ్మవారి ఆశీస్సుల వర్షం కురుస్తుంది
Follow Us