/rtv/media/media_files/2025/10/20/goddess-lakshmi-2025-10-20-12-54-42.jpg)
Goddess Lakshmi
ఈ రోజు దీపావళి సందర్భంగా ధనలక్ష్మిని పూజించేటప్పుడు కొన్ని ప్రత్యేక రంగుల దుస్తులు ధరించడం అత్యంత శుభప్రదంగా చెబుతారు. దేవీ దేవతల ఆశీస్సులు పొందడంలో మనం ధరించే దుస్తుల రంగు కీలక పాత్ర పోషిస్తుంది. లక్ష్మీ పూజ (Lakshmi Puja) సమయంలో ఏయే రంగుల దుస్తులు ధరిస్తే ఇంట్లో సానుకూలత, శ్రేయస్సు కలుగుతాయో కొన్ని విషయాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
శుభప్రదమైన దుస్తులు :
పసుపు/బంగారు రంగు (Yellow/Golden): దీపావళి లక్ష్మీ పూజ సమయంలో పసుపు లేదా బంగారు రంగు దుస్తులు ధరించవచ్చు. ఈ రంగు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఇది జీవితంలో వెలుగు, విజయం, ధనాన్ని తీసుకొస్తుందని నమ్మకం.
ఎరుపు రంగు (Red): ఎరుపు రంగు దుస్తులు ధరించడం కూడా చాలా శుభకరం. ఎరుపు అంగారక గ్రహంతో ముడిపడి ఉంటుంది. మహిళలు ఎరుపు రంగు చీర లేదా దుపట్టా ధరించవచ్చు. ఇది ఆత్మవిశ్వాసం, శక్తి, అదృష్టాన్ని పెంచుతుంది.
తెలుపు రంగు (White): తెలుపు రంగు చంద్రుడికి సంబంధించినది. శాంతి, స్వచ్ఛతకు చిహ్నం. కాబట్టి దీపావళి పూజలో తెలుపు లేదా ఆఫ్-వైట్ రంగు దుస్తులు ధరించడం కూడా మంచిది.
ఇది కూడా చదవండి: హెయిర్ స్పాకి వెళ్ళేముందు ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. లేదంటే మీ జుట్టు సంగతి అంతే!!
ఆకుపచ్చ రంగు (Green): జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ఆకుపచ్చ రంగు బుధ గ్రహానికి సంబంధించినది. లక్ష్మీ పూజ సమయంలో ఈ రంగు దుస్తులు ధరిస్తే ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి.
దీపావళి పండుగ అత్యంత పవిత్రమైనది కాబట్టి ఈ శుభసందర్భంలో నలుపు (Black) రంగు దుస్తులు ధరించడం పూర్తిగా మానుకోవాలి. నలుపు రంగు ప్రతికూలత, విచారం, నిరాశకు చిహ్నంగా భావిస్తారు. అలాగే చిరిగిన లేదా పాత దుస్తులను ధరించకూడదు. కొత్త.. శుభ్రమైన దుస్తులు ధరించి లక్ష్మీదేవిని పూజించడం శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.
ఇది కూడా చదవండి:రాత్రి ఆలస్యంగా తినొద్దు.. అనారోగ్యం బారిన పడొద్దు.. ఎలానో ఇప్పుడే తెలుసుకోండి!!
Follow Us