వామ్మో.. ఉదయాన్నే వ్యాయామం చేయకపోతే ఇంత ప్రమాదమా!

ఉదయాన్నే వ్యాయామం చేయకపోవడం వల్ల గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే కండరాలు బలహీనం కావడం, బరువు పెరగడం వంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి డైలీ మార్నింగ్ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి.

New Update
Walking rule

Walking

వ్యాయామం అనేది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే చాలా మంది ఈ రోజుల్లో అసలు వ్యాయామం చేయరు. దీంతో అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే డైలీ ఉదయాన్నే వ్యాయామం చేయకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి వ్యాయామం చేయకపోతే వచ్చే అనారోగ్య సమస్యలేంటో చూద్దాం. 

ఇది కూడా చూడండి: ఇంటర్ విద్యార్థులకు బిగ్ షాక్.. సెలవులు కుదింపు

గుండె జబ్బులు

ప్రస్తుతం చాలా మంది గుండె పోటుతో చనిపోతున్నారు. వ్యాయామం లేకపోవడం వల్ల గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీంతో గుండె ప్రమాదాలు వచ్చే సమస్య కొంతవరకు తగ్గుతుంది.  

బరువు పెరగడం
శారీరక శ్రమ లేకుండా ఒకే చోటులో కూర్చొని ఉండటం వల్ల బరువు పెరుగుతారు. గంటల తరబడి ఆఫీసులో ఉద్యోగం చేయడం వల్ల అనేక వ్యాధుల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే డైలీ వ్యాయామం చేయడం వల్ల బాడీకి శారీరక శ్రమ అంది ఆరోగ్యంగా ఉంటారు. 

ఇది కూడా చూడండి: MK Stalin:దేని మీద రాళ్లు రువ్వుతున్నారో గమనించుకోండంటూ స్టాలిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌!

కండరాలు బలహీనంగా..
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. అదే చేయకపోతే ఎముకలు, కండరాలు అన్ని బలహీనంగా తయారవుతాయి. కండరాలు సమస్యలు కూడా అధికంగా వస్తాయి. సమయం లేకపోతే వీలు చూసుకుని అయిన వ్యాయామం చేయాలని నిపుణులు అంటున్నారు. 

ఇది కూడా చూడండి:Horoscope: ఈరోజు ఈ రాశివారు డబ్బు నష్టపోయే అవకాశాలున్నాయి..జాగ్రత్త!

ఒత్తిడికి కారణం అవుతారు
వ్యక్తిగత కారణాలు, వర్క్ వల్ల చాలా మంది ఒత్తిడి సమస్యలతో బాధపడుతున్నారు. ఒత్తిడి నుంచి విముక్తి చెందాలంటే వ్యాయామం చాలా ముఖ్యం. వ్యాయామం చేయకపోవడం వల్ల ఒత్తిడికి గురై ఇంకా మానసిక సమస్యలతో ఇబ్బంది పడతారు. 

మంచి నిద్ర
శారీరకంగా, మానసికంగా హాయిగా లేకపోతే నిద్ర కూడా పట్టదు. శరీరానికి శ్రమ లేకపోవడం వల్ల బాడీ అలసిపోదు.

ఇది కూడా చూడండి: Kamal Hasan: ఆలస్యంగా రావడం వల్లే ఓటమి..20 ఏళ్ల ముందే వచ్చి ఉంటే కథ వేరేలా ఉండేది!

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. పూర్తి వివరాలు కోసం దీనికి సంబంధించిన నిపుణులను సంప్రదించగలరు.

Advertisment
తాజా కథనాలు