గుండె ఆరోగ్యానికి వ్యాయామాలు
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా కొన్ని వ్యాయామాలు, యోగా వంటి చేయాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా కొన్ని వ్యాయామాలు, యోగా వంటి చేయాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
తక్కువగా నిద్రపోవడం, బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం, మైదా పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
కేవలం స్వీట్లు తినడం వల్లే మధుమేహం వస్తుందని కొందరు అనుకుంటారు. అయితే ఎక్కువ ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, పోషకాలు లేని ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవడం ఉత్తమం.
వయసుతో పాటు వచ్చే చిన్న చిన్న సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతాయి. వీటి బారిన పడకుండా ఉండాలంటే శరీరానికి వ్యాయామంతో పాటు తగినంత విశ్రాంతి ఇవ్వడం అవసరం. అలాగే ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. ప్రోటీన్లు, విటమిన్లు లభించే ఆహారాన్ని తీసుకోవాలి.
వ్యాయామం చేస్తే.. మగవారి కన్నా ఆడవారికే ఎక్కువ మేలు ఉందని తాజాగా ఓ అధ్యయనంలో బయటపడింది. వాకింగ్ చేయడం, కాస్త వేగంగా పరిగెత్తడం, ఆటలు ఆడటం చేస్తే ఆడవారికి అకాల మరణం ముప్పు 24 శాతం తగ్గాగా.. ఇంతే స్థాయిలో చేసే మగవారికి అకాల మరణం ముప్పు 15 శాతం తగ్గింది.
నిత్యం వ్యాయామం చేయడం వల్ల కుంగుబాటు సమస్య నుంచి కూడా బయటపడొచ్చని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో బయటపడింది. ఆందోళన, గుండెజబ్బులు, క్యాన్సర్ వంటి సమస్యలకు దారితీసే కుంగుబాటు సమస్యకు వ్యాయామం చేయడం వల్ల చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.
వ్వాయామాన్ని కొత్తగా స్టార్ట్ చేసేవారు ముందుగా సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ముఖ్యం. వ్యాయామం ఎంతవరకు చేయాలి.. ఎలాంటి వ్యాయామం చేయాలి అన్నది నిపుణుడు చెబుతాడు. దీని వల్లే అనవసర సమస్యలు రాకుండా ఉంటాయి.
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే వ్యాయమం చేయడం తప్పనిసరి. చాలామంది రకరకాల వ్యాయామాలు చేస్తుంటారు. కొంతమంది ఇవ్వన్నీ మనవల్ల అయ్యే పనులు కావంటూ వదిలేస్తారు. అయితే కనీసం ప్రతిరోజూ ఓ పది నిమిషాల పాటు స్కిప్పింగ్ చేసినా మంచిదని చెబుతున్నారు నిపుణలు.
ఆరోగ్యంగా, ఫిట్నెస్గా ఉండటం కోసం, బరువు తగ్గడం కోసం చాలామంది ఎక్కువగా వ్యాయామాలు చేస్తుంటారు. అయితే ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదని కొంచెం చేసినా కూడా ఫలితాలు కనిపిస్తాయని తమ పరిశోధనల్లో వెల్లడైందంటూ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.