Health Tips: రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే.. ఉదయాన్నే వీటిని తినండి

ఉదయం సమయంలో బాదం, ఉసిరి, తేనె, పుచ్చకాయ రసం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పోషకాలు ఉండే ఇలాంటి పదార్థాలను ఉదయం పూట తింటే రోజంతా యాక్టివ్ ఉంటారని నిపుణులు అంటున్నారు. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

New Update
Food Poisoning: ఫుడ్‌ పాయిజనింగ్‌ జరిగితే ఏం చేయాలి?

health tips

రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం సరైన ఫుడ్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది ఉదయం సమయాల్లో మసాలా ఉండే ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటారు. వీటివల్ల రోజంతా అలసట, నీరసం వంటివి వస్తాయి. అదే పోషకాలు ఉండే ఆరోగ్యమైన పదార్థాలు తీసుకుంటే రోజంతా యాక్టివ్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో చూద్దాం. 

ఇది కూడా చూడండి: Karnataka: చికెన్, మటన్ విక్రయాలు బంద్.. ఎందుకో తెలుసా!

బాదం

ఉదయాన్నే నానబెట్టిన బాదం పప్పులు తినడం వల్ల యాక్టివ్‌గా ఉంటారు. బాదంలో విటమిన్ ఈ, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. 

తేనె
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగితే.. ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా ఫిట్‌గా ఉండటంతో పాటు జీర్ణ సమస్యలు కూడా క్లియర్ అవుతాయి. 

ఇది కూడా చూడండి: Breaking News: ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత మృతి

బొప్పాయి
ఉదయం సమయాల్లో బొప్పాయి తింటే రోజంతా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. అలాగే మలబద్దకం సమస్య కూడా క్లియర్ అవుతుంది. 

ఉసిరి రసం
ఉసిరి రసం ఉదయం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. 

ఇది కూడా చూడండి:RBI: బ్యాంకు అకౌంట్ల పై ఆర్బీఐ కీలక ప్రకటన..ఆ పని చేయలేదో నష్టం మీకే!

పుచ్చకాయ రసం
ఉదయం పూట పుచ్చకాయ రసం తాగడం వల్ల డే అంతా యాక్టివ్‌గా ఉంటారు. ఇందులోని పోషకాలు హైడ్రేట్‌గా ఉండేలా చేస్తాయి.

ఇది కూడా చూడండి: Horoscope: నేడు ఈ రాశి వారు వారికి చాలా దూరంగా ఉండాలి..లేకపోతే ఇక అంతే సంగతులు

నెయ్యి
ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే నెయ్యిని ఉదయం సమయాల్లో తింటే జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు