/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/What-happens-if-you-take-a-brain-supplement-does-it-improve-memory.jpg)
memory
Foods for Brain Health: ప్రస్తుతం చాలా మంది బిజీగా ఉంటూ యోగా, వ్యాయామం వంటివి చేయడం లేదు. వీటివల్ల మెదడు పనితీరు తగ్గిపోతుంది. దీంతో వారు ఎన్నో విధాలుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. అయితే మతిమరుపు వంటివి రాకుండా జ్ఞాపకశక్తి పెరగాలంటే మాత్రం తప్పకుండా కొన్ని ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ పదార్థాలేంటో చూద్దాం.
క్యారెట్
బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే క్యారెట్లను తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. వీటిని పచ్చిగా తినడం, జ్యూస్ చేసి తాగడం, సలాడ్‌లో ఉపయోగించడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
ఇది కూడా చూడండి: Stock Market Today: లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..రికార్డ్ స్థాయిలో బంగారం ధర
బెండకాయ
వీటిలో పాలీఫెనాల్స్, విటమిన్లు ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. దీన్ని కూర, పులుసు, వేయించిన కూడా చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యంగా కూడా ఉంటారు.
బ్రోకలీ
ఎన్నో పోషక విలువలు ఉండే బ్రోకలీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులోని పోషకాలు, విటమిన్లు, సెలీనియం, యాంటీ ఆక్సిడెంట్లు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బ్రోకలీ సలాడ్‌లో డైలీ తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
ఇది కూడా చూడండి: OTT Movies: ఓటీటీలో మిలియన్ల జనం చూసిన సీరీస్ లు, సినిమాలు ఇవే.. మరి మీరు చూశారా?
పాలకూర
ఇందులో విటమిన్ ఎ, కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని డైలీ తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. దీంతో సూప్ లేదా చపాతీ వంటివి చేసి తింటే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి.
ఇది కూడా చూడండి: BREAKING: సినీ దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్.. విస్తృతంగా తనిఖీలు!
టమాటా
ఇందులో లైకోపీన్ అనే పోషకం ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. వీటిని సూప్, సలాడ్, చట్నీ వంటి కూరల్లో ఉపయోగించడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: భట్టి vs ఉత్తమ్ .. రేషన్ కార్డుల జారీపై మంత్రులు తలో మాట!