Short News | Latest News In Telugu | లైఫ్ స్టైల్ప్రస్తుతం రోజుల్లో కంటి సమస్యలతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే డైట్‌లో తప్పకుండా ఈ ఫుడ్స్‌ను యాడ్ చేసుకోవాలి. ఇది కూడా చూడండి: Daaku Maharaaj: బాలయ్యకు బిగ్ షాక్.. డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ క్యాన్సిల్! క్యారెట్లు కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే క్యారెట్ తప్పకుండా తినాలి. ఇందులోని విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది, రోజుకి ఒకటి లేదా రెండు క్యారెట్లు తినడం వల్ల కళ్ల సమస్యలు రావు. క్యారెట్‌లో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కళ్లు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇది కూడా చూడండి: Tirupati: అంతా రెప్పపాటులో జరిగిపోయింది..తిరుపతి ఘటన టైమ్ టు టైమ్ సీన్ బ్రోకలీ బ్రోకలీలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇందులో మెన్జాక్సంతిన్, లుటీన్ అనే కెరోటినాయిడ్లు ఉంటాయి. ఇవి కంటి రెటీనాను దెబ్బతీయకుండా కాపాడతాయి. ఇది కూడా చూడండి: TTD: ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసింది: భూమన కరుణాకర్‌రెడ్డి ఉసిరి ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఆమ్లా రెటీనా, లెన్స్‌ను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. కళ్లకు ఎలాంటి ఒత్తిడి లేకుండా చేస్తుంది. క్యాప్సికమ్ కంటి చూపును మెరుగుపరచడానికి క్యాప్సికమ్ బెస్ట్ అని చెప్పవచ్చు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యాప్సికమ్‌లోని విటమిన్ సి కంటి కణజాలం దెబ్బతినకుండా చేస్తుంది. ఇది కూడా చూడండి: Tirupati Stampede: తొక్కిసలాటకు కారణం అదే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు! బచ్చలికూర రోజూ పాలకూరను తినడం లేదా జ్యూస్ చేసి తాగడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. రెటీనాను బ్లూ రేస్ నుంచి కాపాడుతుంది. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.