Blueberries: ప్రతిరోజూ బ్లూబెర్రీస్ తింటే ఏమవుతుందో తెలుసా?

బ్లూబెర్రీస్‌లో అనేక పోషకాలు, విటమిన్ సి పుష్కలం. బ్లూబెర్రీస్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెరను తగ్గించడం, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడం, శక్తిని ఇవ్వడం, రోగనిరోధక శక్తిని పెంచటంతోపాటు చర్మాన్ని అందంగా మారుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

New Update
Blueberries health

Blueberries health

Blueberries: బ్లూబెర్రీల అధిక కర్తపోటు రోగులకు సూపర్ ఫుడ్స్. అవి పరిమాణంలో చిన్నవిగా ఉన్న శక్తివంతమైన పోషకాలతో నిండి ఉంటాయి. వాటిలో శరీరానికి చాలా అవసరమైన విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. బ్లూబెర్రీస్ తినడం వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షించడమే కాకుండా చర్మాన్ని కూడా అందంగా మారుస్తుంది. రక్తంలో చక్కెరను తగ్గించడం, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడం, శక్తిని ఇవ్వడం, రోగనిరోధక శక్తిని పెంచడం వంటి అనేక విషయాలలో ఇవి సహాయపడతాయి. వీటిలో కేలరీలు తక్కువగా ఉండి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉండే బ్లూబెర్రీస్ ప్రయోజనాల గురించి ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

అధిక రక్తపోటు తగ్గుతుంది:

బ్లూబెర్రీస్ అధిక రక్తపోటు ఉన్నవారికి మంచిది. ఇది గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకం. 30  రోజూలు బ్లూబెర్రీస్ క్రమం తప్పకుండా తింటే శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. రక్త నాళాలు కూడా కుంచించుకుపోకుండా ఉంటాయని, ఇది రక్త ప్రసరణను సరిగ్గా ఉంచుతుంది. బ్లూబెర్రీలలో ఇతర పండ్ల కంటే తక్కువ చక్కెర ఉంటుంది. 150 గ్రాముల బ్లూబెర్రీస్‌లో 14 గ్రాముల చక్కెర ఉంటుంది. ఇది దాదాపు నారింజ పండుతో సమానం. బ్లూబెర్రీలలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. బ్లూబెర్రీలలో ఉండే ఆంథోసైనిన్లు ఇన్సులిన్ సెన్సిటివిటీ, గ్లూకోజ్ జీవక్రియపై మంచి ప్రభావాన్ని చూపుతాయని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి.

 ఇది కూడా చదవండి:  అరటి తొక్కలు తింటే బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు.. ఇంతకు ఇందులో ఏముందంటే!

బ్లూబెర్రీస్ తీపిగా, పోషకాలుగా బాగా ప్రాచుర్యం పొందాయి. బ్లూబెర్రీస్ అగ్రశ్రేణి యాంటీఆక్సిడెంట్ ఆహారాలలో ఒకటి. యాంటీఆక్సిడెంట్లు కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. ఇవి వృద్ధాప్యాన్ని వేగవంతం చేస్తాయి. క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. బ్లూబెర్రీస్‌లో అనేక పండ్లు, కూరగాయల కంటే ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. బ్లూబెర్రీస్‌లో రోగనిరోధక శక్తిని పెంచడానికి అవసరమైన విటమిన్ సి ఉంటుంది. రోగనిరోధక శక్తి బలంగా ఉంటే శరీరం వ్యాధుల నుంచి సురక్షితంగా ఉంటుంది. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: స్త్రీల కంటే పురుషులు ఎక్కువ నీళ్లు తాగాలా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు