/rtv/media/media_files/2025/04/08/hYNOEvm8E4KkNSkqiZ8o.jpg)
Office Work
ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ భిన్నంగా ఉంటారు. భిన్నంగా ఆలోచిస్తారు. వారు పెరిగిన పరిస్థితులు, నేపథ్యాలు భిన్నంగా ఉంటాయి. ఇవన్నీ వారి ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. కాబట్టి అందరూ మనలాగే ఆలోచించాలని ఆశించడం సరికాదని నిపుణులు సలహా ఇస్తున్నారు. మనం సానుకూలంగా ఉన్నంత కాలం, ఇతరులు కూడా అలాగే ఉంటారు. ఇతరులు మన వెనుక మన గురించి మాట్లాడుకోవడం సాధారణం. అలాంటి వ్యక్తుల గురించి, వారి వ్యాఖ్యల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు.
Also Read : బర్త్ డే స్పెషల్.. అల్లు అర్జున్ సాధించిన 8 అరుదైన రికార్డులు ఇవే
గాలి మాటలను విస్మరించడమే..
గాలి మాటల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాళ్లు మాట్లాడితే అది మీ పని మీద ప్రభావం చూపిస్తే.. లేదా మీ గురించి అబద్ధాలు చెబితే, ప్రతిష్టను దెబ్బతీస్తే స్పందించాలి. కానీ మిగిలిన సమయంలో అలాంటి గాలి మాటలను విస్మరించడమే మంచిది. అందరూ మనల్ని గౌరవించాలని కోరుకుంటారు. అలా కోరుకోవడంలో తప్పు లేదు. కానీ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే అందరూ మన గురించి సానుకూలంగా ఆలోచించరు. వారు విమర్శిస్తూనే ఉంటారు. కొన్ని తప్పులను ఎత్తి చూపుతారు. వాళ్లు మన ముందు మాట్లాడలేరు. మీ వెనుక మీ గురించి మాట్లాడితే ఎదురుగా వచ్చి మాట్లాడే ధైర్యం వాళ్లకి లేదని అర్థం.
ఇది కూడా చదవండి: అతిగా ఆలోచించడం వల్ల కలిగే సమస్యలు
అలాంటి వారు చెప్పేది పట్టించుకోకుండా మీ పనిపై దృష్టి సారించి, విజయవంతంగా ముందుకు సాగాలని నిపుణులు అంటున్నారు. మీ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటే వారితో నేరుగా మాట్లాడటం మంచిది. ఏదైనా ఉంటే నాకు నేరుగా చెప్పండి. ఎగతాళి చేయాల్సిన అవసరం ఏముందని నిలదీయాలి. అవసరమైతే ఉన్నతాధికారులతో మాట్లాడి వారి అభిప్రాయం తీసుకోండి. వాటి గురించి ఆలోచించడం ద్వారా అతిగా స్పందించాల్సిన అవసరం లేదు. మీ పనిని సరిగ్గా చేస్తున్నంత కాలం అలాంటి సమస్యలు మిమ్మల్ని ప్రభావితం చేయవని గుర్తుంచుకోవడం మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు.
Also Read : పవన్ కుమారుడికి గాయాలు.. స్పందించిన చిరు, KTR, లోకేష్ తదితరులు.. ఏమన్నారంటే!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో మరో లిఫ్ట్ యాక్సిడెంట్.. స్పాట్లో ముగ్గురు.. నాలుగో ఫ్లోర్ నుంచి కుప్ప కూలడంతో.. !
latest-telugu-news | today-news-in-telugu | healthy life style | daily-life-style | human-life-style | office-work