Lip Balm: ఇంట్లోనే లిప్‌బామ్ తయారు చేసుకోవడం ఎలా?

చలికాలంలో లిప్‌బామ్‌ను తప్పకుండా అందరూ వాడుతుంటారు. ఈ క్రమంలో మార్కెట్లో దొరికే లిప్‌బామ్‌ను వాడటం వల్ల రసాయనాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. అదే బీట్‌రూట్, దానిమ్మ గింజలతో ఇంట్లోనే తయారు చేసుకుంటే పెదవులతో పాటు ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

New Update
Beetroot LipBalm: ఇంట్లోనే బీట్‌రూట్ నుంచి లిప్ బామ్ ఇలా తయారు చేసుకోండి మీ పెదాలు అందంగా మారతాయి

సాధారణంగా చలికాలంలో పెదవులు పొడిబారుతుంటాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మాటిమాటికి పెదవులు పొడిగా అయిపోతుంటాయి. ఈ క్రమంలో కొందరు మార్కెట్లో దొరికే లిప్‌బామ్‌లు ఎక్కువగా వాడుతుంటారు. పెదవులు పగుళ్ల నుంచి ఆ నిమిషానికి ఇవి విముక్తి కల్పించిన కూడా తర్వాత అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తాయి. ఎందుకంటే వీటిని రసాయనాలతో తయారు చేస్తారు. ఇవి మన నోటిలోకి వెళ్తే ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. కాబట్టి ఇంట్లోనే లిప్‌బామ్‌ను ఈజీగా తయారు చేసుకోండి. 

ఇది కూడా చూడండి:  'బిగ్ బాస్ సీజన్ 8' టైటిల్ విన్నర్ గా నిఖిల్

దానిమ్మ గింజలతో..

తాజాగా ఉండే దానిమ్మ గింజలను తీసుకుని రసం చేసుకోవాలి. రెండు చెంచాల దానిమ్మ గింజల రసానికి చెంచా సగం కొబ్బరి నూనె కలపాలి. ఈ రెండింటిని బాగా కలిపి ఒక ఆరు నిమిషాల పాటు చిన్న మంటపై వేడి చేయాలి. అది కాస్త దగ్గర అయ్యాక ఒక పాత్రలోకి తీసుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. అంతే ఇక లిప్ బామ్ రెడీ అయినట్లే. 

ఇది కూడా చూడండి: భూమి లేని నిరుపేదలకు గుడ్ న్యూస్.. ఏటా రూ.12 వేలు

బీట్ రూట్‌తో..

టేబుల్ స్పూన్ పెట్రోలియం జెల్లీని పాత్రలోకి తీసుకోవాలి. దీనికి సమానంగా బీట్‌రూట్ పొడిని కలపాలి. ఆ తర్వాత డబుల్ బాయిల్ పద్ధతిలో పెట్టి ఆ మిశ్రమాలు బాగా కలిసేలా కలపాలి. బాగా కలిసిన తర్వాత బాక్స్‌లోకి తీసుకుంటే లిప్‌బామ్ రెడీ. ఈ సహజ లిప్‌బామ్ పెదాలకు తేమతోపాటు సహజ రంగుని అందిస్తుంది. 

ఇది కూడా చూడండి:  పవన్, పుష్ప భేటీకి డేట్ ఫిక్స్.. మెగా వివాదానికి ఫుల్ స్టాప్!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చూడండి:  తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు