/rtv/media/media_files/2025/01/12/almondsage8.jpeg)
Almonds
బాదం గింజలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని డైలీ ఉదయాన్నే తింటే మొదడు పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతుంటారు. దీంతో చాలా మంది రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే వీటిని తింటారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, ప్రోటీన్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచివే. కానీ మితంగా మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. తీసుకోవాల్సిన మోతాదులో కంటే ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే అతిగా బాదం తినడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: గవర్నమెంట్ టీచర్ : దొరికినకాడికి దోచేసి అడ్డంగా బుక్కయ్యాడు.. సారూ మామూలోడు కాదు!
కిడ్నీ సమస్యలు
బాదం గింజలను ఎక్కువగా నానబెట్టి తినడం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటిలోని ఆగ్జలేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కిడ్నీలో రాళ్లను పెంచడానికి ఉపయోగపడతాయి. కాబట్టి మితంగా మాత్రమే తీసుకోండి.
ఇది కూడా చూడండి: JOBS: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు..డిగ్రీ ఉంటే చాలు..
మలబద్ధకం
బాదం గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని అధికంగా తీసుకుంటే మలబద్ధకం వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి డైలీ నాలుగు బాదం గింజలను మాత్రమే తినడం అలవాటు చేసుకోండి. మలబద్ధకం సమస్య తగ్గాలంటే ఫైబర్ ఎక్కువగా ఫుడ్స్ తీసుకోవాలి. నట్స్‌లో అంజీర్, వాల్‌నట్స్‌లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. అలాగే ఆకుకూరల్లోని ఫైబర్ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది.
ఇది కూడా చూడండి: ఆపరేషన్ చేసిన స్టాప్‌నర్స్ కుట్లకు బదులు ఫెవిక్విక్ వాడితే.. చివరికి
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చూడండి: Mastan Sai : డ్రగ్స్ ఇస్తాడు.. న్యూడ్ వీడియోలు తీస్తాడు.. మస్తాన్ మాములోడు కాదయ్యా!