ఆపరేషన్ చేసిన స్టాప్‌నర్స్ కుట్లకు బదులు ఫెవిక్విక్‌ వాడితే.. చివరికి

కర్ణాటకలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సు కుట్లుకు బదులు ఫెవిక్విక్ వాడింది. ఏడేళ్ల బాబు చెంపకు గాయం కాగా ప్రభుత్వం హాస్సిటల్‌కు తీసుకెళ్తే.. నర్సు కుట్లు వేయకుండా ఫెవిక్విక్‌తో చర్మాన్ని అతికించింది. విషయం బయటకు తెలయడంతో ఆమెను సస్పెండ్ చేశారు.

author-image
By K Mohan
New Update
Feviquick

Feviquick Photograph: (Feviquick)

ఆడుకుంటూ బాలుడి చెంపకు గాయమైంది. తీవ్ర రక్తస్రావంతో బాబుని తల్లిదండ్రులు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఫస్ట్‌ ఎయిడ్ చేసిన స్టాఫ్ నర్సును ఆ గాయానికి కుట్లు వేయాల్సి ఉంది. అయితే కుట్లకు బదులుగా ఆమె ఫెవిక్విక్ వేసి చర్మాన్ని అతికించింది. ఈ ఘటన కర్ణాటకలోని హవేరి జిల్లాలోని హనగల్ తాలూకాలోని అడూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగింది. ఏడేళ్ల గురుకిషన్ అన్నప్ప హోసమణికి జనవరి 14న చెంపకు గాయం కావడంతో తల్లిదండ్రులు అడూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడి నర్స్ గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేసింది.

గాయం చాలా పెద్దది అవడంతో దానికి సిచ్చర్స్(కుట్లు) వేయాల్సి వచ్చింది. కుట్లు వేయమని తల్లిదండ్రులు ఎంత చెప్పినా నర్సు వినిపించుకోలేదు. కుట్లు వేస్తే బాబు ఫేస్‌పై శాశ్వతంగా మచ్చలు ఏర్పడతాయని ఆమె చెప్పింది. ఆ నర్సు చాలా సంవత్సరాలుగా అలానే చేస్తున్నానని కూడా తల్లిదండ్రులకు చెప్పింది. ప్రైమరీ హెల్త్ సెంటర్‌లోని నర్సు కుట్లకు బదులు ఫెవిక్విక్ వేసి చర్మాన్ని అతికించింది.  హాస్పిటల్ ‌సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి.. విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. టాపిక్ సీరియస్‌గా మారి కమిషనర్ ఆఫీస్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సర్వీసెస్ దాకా వెళ్లింది.


కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. నింబంధనల ప్రకారం ఫెవిక్విక్‌ను ట్రీట్‌మెంట్‌ కోసం వాడకుడదని కమిషనర్ ఆఫీస్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సర్వీసెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. పిల్లల చికిత్స కోసం ఫెవిక్విక్‌ను ఉపయోగించిన నర్సును విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఆ విషయంపై విచారణ కూడా జరుపుతున్నారు. గతంలో కూడా ఆమె కుట్లకు బదులు ఫెవిక్విక్‌తో ట్రీట్‌మెంట్ చేసిందా అని తెలుసుకోవడానికి పై అధికారులతో ఏ టీం ఏర్పాటు చేశారు.

Also Read:Jeeth adani:పెళ్లి వేళ దివ్యాంగులకు జీత్ అదానీ గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరికీ ఎన్నిలక్షలసాయం అందించారంటే!

స్టాప్‌నర్సు ఎంత చెప్పినా వినిపించుకోలేదని తిరిగి వాళ్లకే నచ్చజెప్పిందని చెబుతూ తల్లిదండ్రులు ఓ వీడియో రికార్డ్ చేశారు. తరువాత వారు అధికారిక ఫిర్యాదు చేసి, వీడియోను కూడా సమర్పించారు. వీడియో ఆధారాలు ఉన్నప్పటికీ, అధికారులు ఫిబ్రవరి 3న జ్యోతిని సస్పెండ్ చేయడానికి బదులుగా, ఆమెను మరొక ఆరోగ్య కేంద్రానికి హవేరి తాలూకాలోని గుత్తల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ - బదిలీ చేశారు. దీంతో ప్రజల ఆగ్రహం మరింత పెరిగింది. తర్వాత బుధవారం కర్ణాటక వైద్యఆరోగ్య శాఖ సదరు స్టాప్ నర్సును పూర్తిగా సస్పెండ్ చేశారు.

Also Read:Ind vs Eng: భారత్‌తో తొలి వన్డేకు తుది జట్టును ప్రకటించిన ఇంగ్లాండ్.. 15 నెలల తర్వాత అతను ఎంట్రీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు