Ice Cream: ప్రపంచాన్ని ఏలుతున్న 5 ఇండియన్ ఐస్ క్రీమ్స్.. టేస్ట్ అట్లాస్ టాప్ 100లో ప్లేస్

ఇండియాకు చెందిన 5 ప్రసిద్ధ ఐస్ క్రీములు టేస్ట్ అట్లాస్ టాప్ 100 ఐస్ క్రీమ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం........

author-image
By Archana
New Update
Ice Cream

Ice Cream

భారత దేశానికి చెందిన 5 ఐస్ క్రీములు ఇప్పుడు వార్తల్లో నిలిచాయి. అయితే ప్రతి ఏడాది టేస్ట్ అట్లాస్.. ప్రతి ఫుడ్ ఐటమ్ కి సంబంధించి టాప్ 100 ఫుడ్స్ జాబితాను విడుదల చేస్తుంది. కాగా.. తాజాగా ప్రపంచంలోనే టాప్ 100 ఐస్ క్రీమ్ పార్లర్ల జాబితాను విడుదల చేయగా.. అందులో ఇండియాకు  చెందిన ఐదు ప్రసిద్ధ ఐస్ క్రీమ్ పార్లర్లు చోటు దక్కించుకున్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

Also Read: మెడ, ఛాతిపై పదునైన పంటిగాట్లు.. కోల్‌కతా లా విద్యార్థిని మెడికల్ రిపోర్టులో షాకింగ్స్

నేచురల్ ఐస్ క్రీం 

నేచురల్ ఐస్ క్రీం పార్లర్  ఎటువంటి రసాయనాలు లేకుండా ఐస్ క్రీం తయారీకి ప్రసిద్ధి చెందింది. ఇందులో అనేక రకమైన ఫ్లేవర్స్ ఉంటాయి. వాటిలో  వాటిలో టెండర్ కొబ్బరి బాగా పాపులర్. దీనిని నిజమైన కొబ్బరితో తయారు చేస్తారు.

Also Read:  ఏడేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడు అత్యాచారం.. తండ్రిపై కేసు నమోదు

Also Read :  చార్‌ధామ్ భక్తులకు బిగ్ అలర్ట్.. మరోసారి యాత్ర వాయిదా!

రుస్తుం అండ్ కంపెనీ 

ముంబైలోని రుస్తుం & కంపెనీ అనే  ఐస్ క్రీం పార్లర్ 1953 సంవత్సరంలో స్థాపించబడింది. ఇక్కడ 'ఐస్ క్రీం శాండ్‌విచ్‌' బాగా ఫేమస్. క్రిస్పీ వేఫర్ బిస్కెట్ల మధ్య ఐస్ క్రీమ్ పెట్టి ఇది   తయారు చేయబడుతుంది. దీనిని చాలా మంది ఇష్టంగా  తింటారు.

అప్సర ఐస్ క్రీం 

ముంబైలోని అప్సర ఐస్ క్రీం స్పైసీ-స్వీట్ జామ ఐస్ క్రీంకి ప్రసిద్ధి చెందింది. జామకాయ ముక్కలు, మసాలా దినుసులతో దీనిని తయారు చేస్తారు.

పబ్బాస్ ఐస్ క్రీమ్ పార్లర్

మంగళూరుకు చెందిన పబ్బా పార్లర్  'గద్దబ్ ఐస్ క్రీం' కి బాగా పాపులర్.  ఈ రంగురంగుల ఐస్ క్రీంను జెల్లీ, తాజా పండ్లు,  గింజలు ఇలా అనేక  లేయర్స్ తో తయారు చేస్తారు.

కార్నర్ హౌస్

బెంగళూరు లోని  కార్నర్ హౌస్ ఐస్  క్రీమ్ పార్లర్1982 నుండి  డెజర్ట్ ప్రియులకు ఇష్టమైన ప్రదేశం.  ముఖ్యంగా అక్కడ  ప్రసిద్ధ 'డెత్ బై చాక్లెట్' ఐస్ క్రీం చాలా ఫేమస్.     చాక్లెట్ కేక్, ఐస్ క్రీం, రిచ్ చాక్లెట్ సాస్, క్రిస్పీ నట్స్, పైన చెర్రీస్ తో దీనిని తయారు చేస్తారు. 

Also Read :  రాత్రి నిద్రలో పదే పదే నీరు తాగుతారా..? ఇది వ్యాధని తెలుసుకోండి..!!

 

telugu-news | Latest News | taste-atlas | ice-cream

Advertisment
Advertisment
తాజా కథనాలు