Nadendla Manohar: నిబద్దత కలిసిన నాయకున్ని అరెస్ట్‌ చేశారు

నిబద్దత కలిగిన రాజకీయ నేతను అరెస్ట్ చేయడం ఏంటని జనసేన నేత నాదేండ్ల మనోహర్‌ వ్యాఖ్యానించారు. చంద్రబాబును పరామర్శించడానికి వెళ్తుంటే అడ్డుకుంటున్నారన్నారు.

New Update
Nadendla Manohar: నిబద్దత కలిసిన నాయకున్ని అరెస్ట్‌ చేశారు

నిబద్దత కలిగిన రాజకీయ నేతను అరెస్ట్ చేయడం ఏంటని జనసేన నేత నాదేండ్ల మనోహర్‌ వ్యాఖ్యానించారు. చంద్రబాబును పరామర్శించడానికి వెళ్తుంటే అడ్డుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఎలాంటి పాలన సాగుతుందో అర్థం కావడంలేదన్నారు. సీఎం జగన్‌ నియంతలా వ్యవహరస్తున్నారని నాదేండ్ల మనోహర్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు ఇలాంటి నాయకున్ని అధిక మెజార్టీతో గెలిపించి ఇప్పుడు ఇబ్బందులకు గురౌతున్నారని నాదేండ్ల వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ చంద్రబాబును పరామర్శించడానికి వెళ్తే ఎందుకు అడ్డుకుంటున్నారో అర్దం కావడం లేదన్నారు. గతంలో 16 నెలలు జైల్లో ఉన్న జగన్‌ మోహన్‌ రెడ్డిని పరామర్శించడానికి వెళ్లిన వారిని అప్పటి ప్రభుత్వం ఇలానే అడ్డుకుందా అని ప్రశ్నించారు.

కాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని నంద్యాల పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నంద్యాల రేంజ్ డీఐజీ రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఇవాళ ఉదయం చంద్రబాబును అదుపులోకి తీసుకున్నారు. అయితే, చంద్రబాబును అరెస్ట్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, నిసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇక ఇవాళ ఉదయం చంద్రబాబును అరెస్ట్ చేసిన పోలీసులు.. వివిధ మార్గా్ల్లో తిప్పుకుంటూ చివరకు తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి తీసుకువచ్చారు. కాసేపు సిట్ కార్యాలయంలో చంద్రబాబును విచారించనున్నారు అధికారులు. అనంతరం జీజీహెచ్‌లో వైద్య పరీక్‌షలు నిర్వహించి కోర్టు ముందు హాజరుపరుస్తారు. టీడీపీ శ్రేణుల ఆందోళనల నేపథ్యంలో ప్రస్తుతం సిట్ కార్యాలయ రహదారులను పోలీసులు దిగ్బంధించారు. సిట్ నుంచి కోర్టుకు వెళ్లే మార్గాన్ని సైతం తమ అధీనంలోకి తీసుకున్నారు. మరి కోర్టు తీర్పు ఎలా ఉంటుందనే దానిపై ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

టీడీపీ నేతలకు గవర్నర్ అపాయింట్‌మెంట్..

చంద్రబాబు నాయుడి అరెస్ట్ నేపథ్యంలో.. ఇవాళ సాయంత్రం 7.15 గంటలకు టీడీపీ నేతలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు రాష్ట్ర గవర్నర్ నజీర్. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సహా ఇతర నేతలకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు గవర్నర్. ప్రస్తుతం విశాఖ పోర్టు గెస్ట్‌ హౌస్‌లో ఉన్నారు. గవర్నర్. మరోవైపు పోలీసుల నిర్బంధంలో ఉన్న టీడీపీ నేతలు గవర్నర్‌ను కలుస్తారా? లేదా అనే ఉత్కంఠ టీడీపీ వర్గాల్లో నెలకొంది.

Advertisment
తాజా కథనాలు