Hyderabad Rain: గంట వానకే హైదరాబాద్ ఆగమాగం.. కూలిన చెట్లు, చెరువులుగా రోడ్లు.. వీడియోలు వైరల్!
భారీ వర్షాలతో హైదరాబాద్ రోడ్లనీ చెరువులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు మోకాళ్ళ లోతుకు నిలిచిపోయాయి. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈదురుగాలులతో చెట్లు విరిగిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.