Sri Rama Navami: కుటుంబ సమేతంగా భద్రాద్రి రామయ్య సన్నిదికి సీఎం రేవంత్ రెడ్డి
శ్రీరామ నవమి సందర్భంగా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా భద్రాచలం రామాలయాన్ని సందర్శించనున్నారు. ముఖ్యమంత్రి దంపతులు రాముల వారి కళ్యాణానికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం సన్నబియ్యం లబ్ధిదారుని ఇంట్లో భోజనం చేయనున్నారు.