/rtv/media/media_files/2025/04/05/yJznanCCzOoeyapnl0QK.jpg)
Telangan Police Warns on Sharing Porn
స్మార్ట్‌ఫోన్లు అందరికీ అందుబాటులోకి రావడంతో ఫోన్‌లో మంచితో పాటు చెడును కూడా వీక్షించే అవకాశం వచ్చేసింది. దీంతో సాధారణంగా చాలామంది యువత పోర్న్ చూస్తుంటారు. అయితే కొందరు మాత్రం టెలిగ్రామ్, స్నాప్‌చాట్, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా అశ్లీల చిత్రాలు, వీడియోలను షేర్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం లక్ష్మీనగర్‌కు చెందిన పుట్ట అనిల్ అనే వ్యక్తి గత కొన్నిరోజులుగా తన ఫోన్‌లో మైనర్ల పోర్న్ వీడియోలు చూస్తున్నాడు.
Also Read: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆఫ్‌లైన్‌లోనూ రాజీవ్ యువ వికాసం దరఖాస్తులు
కొన్ని అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ విషయాన్ని సైబర్ సెక్యూరిటీ అధికారులు గమనించారు. భూంపల్లి ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం ఒప్పుకున్నాడు. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీసులు శనివారం ఎక్స్‌లో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ''అశ్లీల వీడియోలను చూడటం, షేర్ చేయడం కూడా నేరమే. పోర్నోగ్రఫీని ఎట్టిపరిస్థితుల్లోనూ చూడొద్దు. షేర్ చేసి చిక్కుల్లో పడకండి. సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలు పోస్టింగ్స్, షేర్స్ చేసేవారిపై నిఘా ఉంటుందని గుర్తుంచుకోండని'' రాసుకొచ్చారు. లైకుల కోసం సోషల్ మీడియాలో పోర్న్ వీడియోలు పోస్టింగ్స్, షేర్స్ చేసేవాళ్లపై నిఘా ఉంటుందని తెలిపారు. అశ్లీల చిత్రాలు షేర్ చేసే వాళ్లు శిక్షలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.
అశ్లీల వీడియోలను చూడటం, షేర్ చేయడం కూడా నేరమే. పోర్నోగ్రఫీని ఎట్టిపరిస్థితుల్లోనూ చూడొద్దు. షేర్ చేసి చిక్కుల్లో పడకండి. సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలు పోస్టింగ్స్, షేర్స్ చేసేవారిపై నిఘా ఉంటుందని గుర్తుంచుకోండి.#telanganapolice #SayNoToPornography pic.twitter.com/Biwfs0qGxq
— Telangana Police (@TelanganaCOPs) April 5, 2025
Also Read: ఏడుగురిని పొట్టనబెట్టుకున్న ఫేక్ డాక్టర్.. ఎన్నో గుండె ఆపరేషన్లు
మరోవైపు నెటిజన్లు కూడా దీనిపై స్పందిస్తున్నారు. ముందుగా ఆయా పోర్న్ సైట్స్‌ను తెలంగాణలో నిషేధించాలని, సర్వర్లను ఆపేయాలని పోలీసులను కోరుతున్నారు. ఇదిలాఉండగా ప్రపంచంలో అతిపెద్ద పోర్న్ వెబ్‌సైట్ పోర్న్‌హబ్ రిపోర్టు ప్రకారం.. అమెరికా, బ్రిటన్‌ల తర్వాత అత్యధికంగా భారత్‌లో పోర్న్ చూస్తున్నారని తెలిపింది. భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉందని.. చాలామంది మొబైల్‌లోనే పోర్న్ చూస్తున్నారని పేర్కొంది.
rtv-news | telugu-news | telangana-police