Telangana: ట్రంప్ టారిఫ్‌లు మనకు మేలే చేస్తాయి.. శ్రీధర్‌ బాబు కీలక ప్రకటన

ట్రంప్‌ విధిస్తున్న సుంకాలు మనకు మేలే చేస్తాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలు భారత్‌ వైపే చూస్తున్నారన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

New Update
Trump and Minister Sridhar Babu

Trump and Minister Sridhar Babu

ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ దేశాల ఉత్పత్తులపై ట్రంప్‌ విధిస్తున్న సుంకాలు ఒక రకంగా మనకు మేలే చేస్తాయని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలు భారత్‌ వైపే చూస్తున్నారని పేర్కొన్నారు. దీన్ని అనుకూలంగా మార్చుకుని ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరం(GIBF) ఆధ్వర్యంలో పార్క్‌ హయత్‌లో నిర్వహించిన  ‘‘ఇండియా - లాటిన్ అమెరికా, కరీబియన్ కంట్రీస్ బిజినెస్ కాంక్లేవ్’’ రెండో ఎడిషన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 

Also Read: ఎంపురాన్ చిత్ర నిర్మాతకు షాక్‌...ఈడీచేతికి చిక్కిన రూ.1.5 కోట్లు

తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాల అధికార ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. అలాగే  పరిశ్రమల కోసం రాష్ట్రంలో ఉన్న అనుకూలతలు, ప్రభుత్వం నుంచి పారిశ్రామివేత్తలకు అందించే ప్రోత్సాహకాలను వివరించారు. రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. తెలంగాణ MSMEలు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటేలా ప్రత్యేక పాలసీని తీసుకొచ్చామని తెలిపారు. 

Also Read: ఏడుగురిని పొట్టనబెట్టుకున్న ఫేక్ డాక్టర్.. ఎన్నో గుండె ఆపరేషన్లు

అంతేకాదు పెట్టుబడులకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని తెలిపారు. జహీరాబాద్‌ నిమ్జ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు 6 అంతర్జాతీయ స్థాయి సంస్థలు ముందుకొచ్చాయని తెలిపారు. వీటిలో మూడు కొరియా కంపెనీలు ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ద్వితియ, తృతీయ శ్రేణి నగరాలతో పాటు, పట్టణాల్లోను పరిశ్రమలు ఏర్పాటు చేసేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. అలాగే ఆగ్రో ప్రాసెసింగ్ రంగాన్ని పోత్సహిస్తామని.. అన్నదాతలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. 

Also Read: ప్రధాని మోదీకి శ్రీలంక అత్యున్నత పురస్కారం మిత్ర విభూషణ

telangana | minister-sridar-babu | telugu-news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు