Harbhajan: కోహ్లీ బ్యాటింగ్‌పై బజ్జీ షాకింగ్ కామెంట్స్.. అవసరం లేదంటూ!
విరాట్ బ్యాటింగ్‌పై హర్భజన్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. స్లో బంతులు, లెగ్గీలను అసౌకర్యంగా ఫీల్ అవుతున్నట్లు చెప్పాడు. క్రీజ్‌లో సెట్ అయ్యేందుకు టైమ్ తీసుకోవాలన్నాడు. తన లోపాన్ని సరిచేసుకుంటే లయ అందుకుంటాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు.
harbajan sng Photograph: (harbajan sng)
Feb 21, 2025 21:12 IST
Corona Virus: షాకింగ్.. చైనాలో కొవిడ్ లాంటి మరో వైరస్ గుర్తింపు
చైనాలో కొవిడ్ లాంటి మరో కొత్త వైరస్‌ను పరిశోధకులు గుర్తించారు. ఈ వైరస్ జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పుగా భావిస్తు్నారు. దీన్ని'హెచ్‌కెయూ5- కోవ్-2’గా పిలుస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Chinese team finds new bat coronavirus
Feb 21, 2025 13:19 IST
పవన్ కళ్యాణ్ ఫొటోల మార్ఫింగ్‌పై కేసులు నమోదు!
పవన్ కళ్యాణ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తిరుపతి వెస్ట్ పీఎస్ పరిధిలో జగనన్న సైన్యం పేరుతో ఫొటో అసభ్య మార్ఫింగ్‌పై కేసు నమోదు కాగా చిత్తూరులో హరీష్ రెడ్డిపై కేసు నమోదు అయింది.
Feb 21, 2025 09:46 IST
కొణిదెల అంజనమ్మకు అస్వస్థత?
మెగాస్టార్ చిరంజీవి తల్లి కొణిదల అంజనమ్మకు అస్వస్థతకు గురి అయినట్లుగా తెలుస్తోంది. చికిత్స కోసం ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
konidela anjanamma
Feb 21, 2025 09:30 IST
తాజ్‌బంజారా హోటల్ సీజ్
బంజారాహిల్స్‌లోని తాజ్‌బంజారా హోటల్ కు జీహెచ్‌ఎంసీ అధికారులు బిగ్ షాకిచ్చారు. గడిచిన రెండేళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేశారు. పన్ను చెల్లించాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా యాజమాన్యం స్పందించకపోవడంతో హోటల్ ను శుక్రవారం ఉదయం సీజ్ చేశారు.
భారత అగ్రశ్రేణి డబుల్స్ ఆటగాడు రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ తండ్రి కాశీ విశ్వనాథ్ గుండెపోటుతో మరణించారు. శుక్రవారం ఢిల్లీలో సాత్విక్ మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కరం అందుకోనుండటంతో ఆ కార్యక్రమానికి వెళ్తుండగా ఆయన చనిపోయారు.
Feb 21, 2025 08:05 IST
కుంభమేళాలో మహిళల వీడియోలు షేర్ .. 15 సోషల్ మీడియా అకౌంట్లపై కేసు బుక్ !
మహా కుంభమేళాలో మహిళల భక్తులు స్నానం చేస్తున్న అభ్యంతరకరమైన ఫోటోలు, వీడియోలను విక్రయించినందుకు 15 సోషల్ మీడియా ఖాతాలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అప్‌లోడ్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను గుర్తించేందుకు మెటా నుంచి వివరాలు కోరినట్లు పోలీసులు వెల్లడించారు.
Feb 21, 2025 08:04 IST
ఇలా అయితే హైడ్రాను మూసేయాల్సొస్తుంది..హైకోర్టు
హైడ్రాపై తెలంగాణ హైకోర్టు మళ్ళీ ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థలాల హక్కులను తేల్చే అధికారం మీకు ఎవరు ఇచ్చారంటూ ప్రశ్నించింది. జీవో 99కు విరుద్ధంగా వెళితే...దానిని రద్దు చేసి హైడ్రాను మూసివేయాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది.
Feb 21, 2025 08:04 IST
తెలంగాణలో విషాదం.. గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఓ పదో తరగతి బాలిక గుండె పోటుతో మరణించింది. గురువారం ఉదయం స్కూల్‌కి నడుచుకుని వెళ్తుండగా.. ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే స్కూల్ యాజమాన్యం సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గ మధ్యంలోనే ఆ యువతి మృతి చెందింది.
kAMAREDDY Photograph: (kAMAREDDY)
Feb 21, 2025 08:02 IST
కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. అజారుద్దీన్తో సమానంగా
Feb 21, 2025 08:01 IST
సౌరవ్ గంగూలీకి తప్పిన ఘోర ప్రమాదం.. రెండు కార్లు ధ్వంసం!
సౌరవ్ గంగూలీ కారు దుర్గాపూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదానికి గురైంది. గురువారం రాత్రి ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గంగూలీ కారు ముందు ఒక ట్రక్కు అకస్మాత్తుగా రావడంతో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్‌లు వేయాల్సి వచ్చింది.
Feb 21, 2025 08:01 IST
ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులను తొలగించిన సర్కార్
లోకాయుక్త ఇచ్చిన ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎలాంటి పర్మిషన్ లేకుండా, విధులకు గైర్హాజరవుతున్న55 మంది ఉద్యోగులను వెంటనే ఉద్యోగాలు తొలగించాలని ఏపీ సర్కార్ కి లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది.