BIG Breaking :  తాజ్‌బంజారా హోటల్‌ సీజ్

బంజారాహిల్స్‌లోని తాజ్‌బంజారా హోటల్‌ కు జీహెచ్‌ఎంసీ అధికారులు బిగ్ షాకిచ్చారు.  గడిచిన రెండేళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేశారు.  పన్ను చెల్లించాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా యాజమాన్యం  స్పందించకపోవడంతో హోటల్ ను శుక్రవారం ఉదయం సీజ్ చేశారు.

New Update
taj banjara

బంజారాహిల్స్‌లోని తాజ్‌బంజారా హోటల్‌ కు జీహెచ్‌ఎంసీ అధికారులు బిగ్ షాకిచ్చారు.  గడిచిన రెండేళ్లుగా పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేశారు.  పన్ను చెల్లించాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా యాజమాన్యం  స్పందించకపోవడంతో హోటల్ ను శుక్రవారం ఉదయం సీజ్ చేశారు. హోటల్‌ లోని అన్ని గేట్లకు తాళాలు వేశారు.  రెండు సంవత్సరాలుగా తాజ్‌బంజారా హోటల్‌ సంస్థ  రూ. కోటి 40 లక్షల పన్ను బకాయిలు ఉన్నట్లుగా తెలుస్తోంది.  

Also Read :  ఇంటర్వ్యూ కోసం ఏకంగా సత్య నాదెళ్లకే మెయిల్‌..ఎంత సేపటిలో రిప్లై వచ్చిందో తెలుసా!

దేశంలోనే అత్యంత ప్రాముఖ్యత సంపాదించుకున్న తాజ్ బంజారా హోటల్ ను  మున్సిపల్ అధికారులు సీజ్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనిపై మాట్లాడాలని భావిస్తే, యాజమాన్యం నేరుగా ఆఫీసుకు వచ్చి మాట్లాడాలని నోటీసుల్లో ప్రస్తావించారు అధికారులు. ఈ హోటల్‌కు ఎక్కువగా సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, క్రీడా ప్రముఖులు వస్తుంటారు. ఇందులోనే బస చేస్తుంటారు.  పార్టీ సమావేశాలకు అనుకూలంగా ఉండడంతో ఎక్కువ మంది దీని వైపు మొగ్గుచూపుతుంటారు.

Also Read :  సౌరవ్ గంగూలీకి తప్పిన ఘోర ప్రమాదం.. రెండు కార్లు ధ్వంసం!

రోజూ వారి ఆదాయం లక్షల్లో

జీహెచ్‌ఎంసీ అధికారులు హోటల్ ను సీజ్ చేయడంతో తాజ్‌బంజారా యాజమాన్యం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. చచ్చినట్లుగా బకాయిలు చెల్లిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.  తాజ్‌బంజారా హోటల్ రోజూ వారి ఆదాయం లక్షల్లో ఉంటుంది. హై క్లాస్ ఫ్రోఫైల్ వ్యక్తులు ఇక్కడ బస చేస్తూ ఉంటారు. అలాంటిది ఇప్పుడు సీజ్ అయితే వారంతా ప్రత్యామ్నయ మార్గాలు ఎదురుకోవాల్సి ఉంటుంది.  ఇది హోటల్ కు బిగ్ డ్యామేజ్ అని చెప్పుకోవచ్చు.  

Also Read :   Indiramma Housing : రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. రేపు ఇందిరమ్మ ఇండ్లకు శ్రీకారం

Also Read :   Maha Kumbh: కుంభమేళాలో నీటి నాణ్యతపై యోగి సర్కార్ చీటింగ్.. తప్పుడు రిపోర్ట్ పై ఎన్జీటీ సీరియస్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు