Harbhajan: కోహ్లీ బ్యాటింగ్‌పై బజ్జీ షాకింగ్ కామెంట్స్.. అవసరం లేదంటూ!

విరాట్ బ్యాటింగ్‌పై హర్భజన్‌ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. స్లో బంతులు, లెగ్గీలను అసౌకర్యంగా ఫీల్ అవుతున్నట్లు చెప్పాడు. క్రీజ్‌లో సెట్ అయ్యేందుకు టైమ్ తీసుకోవాలన్నాడు. తన లోపాన్ని సరిచేసుకుంటే లయ అందుకుంటాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు. 

New Update
harbajan sng

Harbhajan Singh interesting comments on Virat batting

Harbhajan Singh: విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై భారత మాజీ క్రికెటర్ హర్భజన్‌ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. గత కొంతకాలగా స్పిన్ బౌలింగ్ లో ఇబ్బందిపడుతున్న విరాట్ కు పలు కీలక సూచనలు చేశాడు. స్లో బంతులు, లెగ్గీలను అసౌకర్యంగా భావిస్తున్నాడని చెప్పాడు. లెగ్‌సైడ్ వచ్చే బంతులను ఆడేందుకు ప్లాన్ లేకపోవడంతో విఫలమవుతున్నాడన్నారు. స్ట్రైక్‌ను రొటేట్ చేయకపోవడంవల్లే మరింత ఒత్తిడికి గురువుతున్నాడన్నారు. 

కోహ్లీ అలా చేయట్లేదు..

ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న భజ్జీ.. విరాట్ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నప్పుడు ఎక్కువగా సింగిల్స్‌పైనే దృష్టిపెట్టాలని చెప్పాడు. 'క్రీజ్‌లో సెట్ అయ్యేందుకు టైమ్ తీసుకోవాలి. కానీ కోహ్లీ అలా చేయట్లేదు. ఎంత గొప్ప ప్లేయరైనా సరే ప్రదర్శనే కీలకంగా చూస్తారు. వారసత్వం అసలే కలిసి రాదు. ఆడాలనే సంకల్పం ఉండాలి. పరుగులు చేయాలనే పట్టుదల ఉండాలి. సింగిల్స్‌ కూడా తీయకుండా క్రీజ్‌లో ఉండటం వల్ల ఒత్తిడి రెట్టింపు అవుతుంది. భారీ షాట్లకు వెళ్లి వికెట్ ఇచ్చేస్తాం. అయితే కోహ్లీ తానేంటో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. సత్తా ఏంటో నమ్మితే చాలు' అంటూ చెప్పుకొచ్చాడు. 

ఇది కూడా చదవండి: Crime: అల్లుడితో అత్త శృంగారం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మామ.. చివరికి ముగ్గురు కలిసి!

ఇదిలా ఉంటే.. విరాట్‌ గొప్ప బ్యాటర్‌ అని రాబిన్ ఉతప్ప అన్నాడు. తన అభిప్రాయం ప్రకారం అతడు కాస్త డైలమాలో ఉన్నాడని చెప్పాడు. స్వేచ్ఛగా ముందుకు సాగితే పరుగులు అవే వస్తాయని సూచించాడు. విరాట్ 2 అండ్‌ 3 స్లిప్స్‌ మధ్య ఎక్కువగా రన్స్ చేస్తాడు. కానీ ఇటీవల ఎక్కువగా కీపర్‌, ఫస్ట్ స్లిప్‌ మధ్య రన్స్ చేస్తున్నాడు. ఆఫ్‌సైడ్‌ కవర్‌ డ్రైవ్‌ ఆడాలని ప్రయత్నించి విఫలమవుతున్నాడు. ఇష్టమైన షాట్‌ అయినప్పటికీ అది ప్రమాదమేనన్నాడు. లోపాన్ని సరిచేసుకుంటే లయ అందుకుంటాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు. 

ఇది కూడా చదవండి: Eknath Shinde: అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టా.. నన్ను తేలిగ్గా తీసుకోవద్దు: ఏక్‌నాథ్‌ షిండే

Advertisment
తాజా కథనాలు