/rtv/media/media_files/2025/02/21/NHUQ1Z2vr6Ulnpb4aTJB.jpg)
Chinese team finds new bat coronavirus
కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా అల్లకల్లోలం చేసిందో అందరికీ తెలిసిందే. చైనాలో కొవిడ్ లాంటి మరో కొత్త వైరస్‌ను పరిశోధకులు గుర్తించడం కలకలం రేపుతోంది. ఈ వైరస్ జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పుగా భావిస్తు్నారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ కొత్త వైరస్‌కు హెచ్‌కెయూ5- కోవ్-2’గా పేరు పెట్టారు. ఇది కొవిడ్ 19కి కారణమైన SARS-CoV-2 ను పోలి ఉందని పరిశోధనల్లో తేలినట్లు హాంకాంగ్‌కు చెందిన ఓ వార్త పత్రిక తన కథనంలో వివరించింది.
Also Read: అల్లుడితో అత్త శృంగారం.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న మామ.. చివరికి ముగ్గురు కలిసి!
గబ్బిలాల్లో కరోనా వైరస్‌లపై ఎక్కువగా పరిశోధనలు చేసిన ప్రముఖ వైరాలజిస్టు షీ ఝెంగ్‌లీ ఈ పరిశోధానికి బృందానికి నాయకత్వం వహించారు. గాంఘ్జౌ లేబోరేటరీ, గాంఘ్జౌ అకాడమీ ఆఫ్ సైన్సెస్, వుహాన్ యూనివర్సిటీతో పాటు వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన సైంటిస్టులు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నారు.
Also Read: మరో మీర్ పేట మర్డర్.. 20 ఏళ్లుగా ఫ్రిజ్ లోనే పుర్రె, అస్థి పంజరం.. ఆ డెడ్ బాడీ ఎవరిది?
అయితే ఈ వైరస్ మెర్బెకోవైరస్‌తో పాటు ప్రాణాంతక మెర్స్-కోవ్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) సబ్ వేరియంట్‌కు చెందినట్లుగా పరిశోధనల్లో తేలింది. HKU5-CoV-2 అనేది నేరుగా మాధ్యమజీవుల నుంచి మనుషులకు వ్యాపించే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వైరస్ సామర్థ్యం కొవిడ్-19తో పోలిస్తే తక్కువగానే ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. స్పాట్‌లోనే 9మంది మృతి!
Also Read: ట్రంప్ ఎఫెక్ట్ ...నిర్బంధించి పంపేస్తారన్న భయంతో 11 ఏళ్ల బాలిక ఆత్మహత్య!