పాపం.. ఎయిర్ పోర్ట్ లో ఒక్క కాలితో కుంటుతున్న రష్మిక.. వీడియో వైరల్!
నటి రష్మిక ఎయిర్ పోర్ట్ విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇటీవలే కాలికి గాయం కావడంతో కారు నుంచి దిగడానికి ఇబ్బంది పడుతూ కనిపించింది. ఒకే కాలితో కుంటుతూ వీల్ చైర్ లో కూర్చుంది. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ పెడుతున్నారు.
వన్ ఇయర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) విధానాన్ని తిరిగి పునరుద్ధరించాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) తాజాగా నిర్ణయించింది. 2025 జనవరి 11వ తేదీన సమావేశమైన ఎన్‌సీటీఈ పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుంది.
Bachelor of Education Photograph: ( Bachelor of Education)
Jan 22, 2025 12:34 IST
ఉస్మానియా యూనివర్సిటీ పదోన్నతుల్లో లొల్లి.. ఔటా ఫిర్యాదు
ఉస్మానియా యూనివర్సిటీలోని సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతుల్లో అక్రమాలు జరిగాయని వెల్లడైంది. ఇదే అంశంపై ఉస్మానియా టీచర్స్ అసోసియేషన్ (ఔటా) ప్రతినిధులు చేసిన కంప్లైంట్స్ పై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) రియాక్ట్ అయింది.
ou professors Photograph: (ou professors)
Jan 22, 2025 12:18 IST
సినీ దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ రైడ్స్.. విస్తృతంగా తనిఖీలు!
స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పుష్ప-2 సినిమా భారీ కలెక్షన్ల నేపథ్యంలో హైదరాబాద్‌లోని నివాసంలో బుధవారం తెల్లవారు జామున దాడులు చేసిన అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.
Jan 22, 2025 12:17 IST
భట్టి vs ఉత్తమ్ .. రేషన్ కార్డుల జారీపై మంత్రులు తలో మాట!
రేషన్ కార్డుల జారీ విషయంలో మంత్రులు భట్టి , ఉత్తమ్ లో మాట చెప్పడం ఇప్పుడు లబ్ధిదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 40 లక్షల రేషన్ కార్డులు మంజూరు చేస్తామని అంటే.. భట్తి 10 లక్షల రేషన్ కార్డులు అని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.
bhatti vs uttam Photograph: (bhatti vs uttam )
Jan 22, 2025 11:51 IST
లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..రికార్డ్ స్థాయిలో బంగారం ధర
ఈ రోజు స్టాక్ మార్కెట్ లో పెరుగుదల కనిపిస్తోంది. ఉదయం మార్కెట్ మొదలైన దగ్గర నుంచే సూచీలు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభంతో 76,150 వద్ద ట్రేడవుతోంది. ఇక నిఫ్టీ సుమారు 100 పాయింట్ల పెరిగి.. 23,100 స్థాయి వద్ద ట్రేడవుతోంది.
Jan 22, 2025 11:19 IST
జేఈఈ మెయిన్ పరీక్షలు ప్రారంభం
జేఈఈ మెయిన్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.హైదరాబాద్ లోని పలు పరీక్ష కేంద్రాల వద్ద సందడి నెలకొంది ఎల్‌బీనగర్‌లో ట్రాఫిక్‌కు కాసేపు అంతరాయం కలిగింది.
jeemain Photograph: (jeemain)
Jan 22, 2025 10:38 IST
డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం.. ఆ ఉద్యోగులందరికీ లేఆఫ్‌లు!
డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. పాలనలో మరింత దూకుడు పెంచారు ట్రంప్. తాజాగా ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ సిబ్బంది అందరికీ లేఆఫ్‌లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వారందరినీ సెలవుపై వెళ్లిపోవాలని ఉత్తర్వులు జారీ చేశారు.
బస్సు కోసం అడిగితే ఎత్తుకెళ్ళి రేప్ చేశారు..బెంగళూరు టెర్రర్
బెంగళూరులో కొందరు దుండగులు అరాచకం సృష్టించారు. బస్సు కోసం వెయిట్ చేస్తున్న 37 మహిళపై దారుణానికి ఒడిగట్టారు. ఆమెను లైంగికంగా వేధించడమే కాకుండా మొబైల్, నగలు, డబ్బులు దోచుకెళ్లారు.
Jan 22, 2025 10:37 IST
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది స్పాట్ డెడ్
Jan 22, 2025 10:37 IST
దిల్ రాజు ఇంట్లో కొనసాగుతున్న ఐటీ సోదాలు
హైదరాబాద్ లో వరుసగా రెండో రోజు సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు ఎస్‌వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు.
IT Raids In Hyderabad
Jan 22, 2025 10:36 IST
కర్నూల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
Jan 22, 2025 09:16 IST
రికార్డు వసూళ్లతో దుమ్మురేపుతున్న వెంకీ మామ.. వారం రోజుల్లో ఎన్ని కోట్లంటే!
వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబోలో విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు వసూళ్లు రాబడుతోంది. వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 203 పైగా వసూళ్లు చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు.
sankranthiki vasthunnam
Jan 22, 2025 08:00 IST
నేటి నుంచే ఇంగ్లాండ్- భారత్ టీ 20 సిరీస్
ఆస్ట్రేలియా సీరీస్ ఓటమి తర్వాత టీమ్ ఇండియా మరో సీరీస్ కు సిద్ధమైంది. అక్కడ పరాజయాలను ఇంగ్లాండ్ తో జరిగే టీ 20 సీరీస్ తో తుడిచేయాలని భావిస్తోంది. ఈ రోజు నుంచి జరగనున్న టీ20కు రెడీ అయింది.
India Vs England
Jan 22, 2025 07:59 IST
చచ్చిన ఈ కోడి ధర రూ.లక్ష.. ఎందుకంత స్పెషల్!
కేజీ చికెన్ ధర మహా అయితే ఎంతుంటుంది... రూ. 300 లేదా రూ. 400 కానీ ఈ కోడి ధర రూ.లక్ష కంటే ఎక్కువ ఉందంటే మీరు నమ్ముతారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఏముంది ఈ కోడిలో.. అంత ధర ఎందుకో తెలియాలటే ఈ వార్త పూర్తిగా చదవండి.
cock fighting Photograph: (cock fighting )
Jan 22, 2025 07:58 IST
గుబులు గుబులుగా భారతీయులు..తిరుగుటపా తప్పదేమో..
ట్రంప్ వచ్చాడు ఇండియన్స్ ప్రాణాలు అరచేతుల్లోకి వచ్చాయి. ఎప్పుడు తమని పంపించేస్తాడో అంటూ భయంభయంగా రోజులు గడపాల్సి వస్తోంది. అమెరికాకు వలస వచ్చిన వారి మీద ఆంక్షలు తప్పవని చెబుతున్న ట్రంప్ దానికి తగ్గట్టుగా చర్యలు మొదలుపెట్టేశారు.
Trump likely to sign 100 executive orders Photograph: (Trump likely to sign 100 executive orders)
Jan 22, 2025 07:58 IST
ఇన్స్టా బ్యూటీ మోనాలిసాకు బంపరాఫర్.. ఏకంగా బాలీవుడ్ సినిమాలో
మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన మోనాలిసాకు బాలీవుడ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చేసింది. డైరెక్టర్ సనోజ్ మిశ్రా తన కొత్త సినిమాలో మోనాలిసాను తీసుకోబోతున్నారు. మోనాలిసాను కలిసేందుకు త్వరలోనే తాను ప్రయాగ్ రాజ్ కు వెళ్లనున్నట్లుగా వెల్లడించారు.
monalisa bhosle Photograph: (monalisa bhosle)
Jan 22, 2025 07:57 IST
ఎంపీ ఈటల రాజేందర్కు బిగ్ షాక్.. కేసు నమోదు చేసిన పోలీసులు
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కు బిగ్ షాక్ తగిలింది. ఆయనపై కేసు నమోదైంది. గ్యార ఉపేందర్ ఇచ్చిన పిర్యాదు పై కేసు నమోదు చేశారు పోచారం పోలీసులు. 126(2),115(2),352,351(2),r/w 189(2),r/w 191(2) BNS యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు.
Eatala Rajendar Photograph: (Eatala Rajendar)
Jan 22, 2025 07:57 IST
హమాస్ ఎటాక్ ఎఫెక్ట్...ఐడీఎఫ్ ఛీఫ్ రాజీనామా
ఇజ్రాయెల్ సైన్యం చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జీ హలేవీ రాజీనామా చేశారు. హమాస్ దాడి చేసినప్పుడు దాన్ని నివారించడంలో తాను విఫలమయ్యాయని...అందుకే రాజీనామా చేస్తున్నానని ఆయన తెలిపారు. దాడిపై దర్యాప్తుకు తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు.
IDF Cheif Halevi
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
సంబంధిత కథనాలు
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి