Sankranthiki Vasthunam
Sankranthiki Vasthunam: విక్టరీ వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబోలో సంక్రాంతి కానుకగా విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. సంక్రాంతి సెలవులు పూర్తయినా సినిమా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీ నమోదు చేస్తోంది. ఇప్పటి వరకూ బుక్ మై షోలో 2.5 మిలియన్ టికెట్లు అమ్ముడయ్యాయి. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కోసం కేటాయించిన థియేటర్లలో కూడా ఈ సినిమానే ప్రదర్శిస్తున్నారు. మరోవైపు ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేకపోవడంతో వెంకీమామ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: Rashmika: కొత్త అవతారమెత్తిన రష్మిక.. 'ఏసుబాయిగా' ఛావా ఫస్ట్ లుక్
వారం రోజుల్లో రూ. 203 పైగా కోట్లు..
విడుదలైన వారం రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 203+ కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృదం సోషల్ మీడియా వేదికగా పోస్టర్ రిలీజ్ చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో భీమ్స్ అందించిన పాటలు ప్రేక్షకులను బాగా అలరిస్తున్నాయి. 'గోదారి గట్టు' సాంగ్ 121 మిలియన్ వ్యూస్‌తో టాప్-100 మ్యూజిక్ వీడియోల్లో నెంబర్1గా ఉంది.
Overwhelmed with love and gratitude 🙏 Thank you for making #SankranthikiVasthunam a massive blockbuster at Box-office. This Sankranthi will remain unforgettable forever. All your support means the world! ❤️🔥🤗 https://t.co/TeUrmaxvTV
— Anil Ravipudi (@AnilRavipudi) January 21, 2025
వెంకీ మామ కెరీర్ టాప్ రికార్డ్
'సంక్రాంతికి వస్తున్నాం' వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్టుగా నిలిచింది. ఇప్పటివరకు వెంకీమామ నటించిన చిత్రాల్లో.. రూ.132 కోట్లతో అత్యధిక వసూళ్లు చేసిన మూవీగా 'ఎఫ్2' ఉండగా.. ఇప్పుడు 'సంక్రాంతికి వస్తున్నాం' ఆ రికార్డును బ్రేక్ చేసింది. సీనియర్ హీరోల్లో రూ.200 కోట్లు వసూళ్లు చేసిన నటుల్లో చిరంజీవి తర్వాత ఆ రికార్డును వెంకటేష్ అందుకున్నారు. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, సైరా నరసింహా రెడ్డి చిత్రం రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి.
Also Read: Dil Raju: ఐటీ సోదాల్లో బిగ్ ట్విస్ట్.. దిల్ రాజు సతీమణితో బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయించిన అధికారులు!