/rtv/media/media_files/2025/01/22/iU5ofSi7MJ1H7uMe7Z6g.jpg)
IT Raids In Hyderabad
రెండోరోజు హైదరాబాద్‌లో ఐటీ హోదాలు (IT Raids) కొనసాగుతున్నాయి. ఎస్‌వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు చేస్తున్నారు. సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై అధికారులు ఆరాలు తీస్తున్నారు. పుష్ప-2 బడ్జెట్, వచ్చిన ఆదాయంపై లెక్కలు అడుగుతున్నారు. ఐటీ రిటర్న్స్ భారీగా ఉండడంతోనే ఈ సోదాలు చేస్తున్నారని తెలుస్తోంది. నిన్న దిల్ రాజు భార్య తేజస్వినితో
బ్యాంకు లాకర్లు తెరిపించిన అధికారులు..ఈరోజు మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలించనున్నారని తెలుస్తోంది. ఎస్‌వీసీ ఆఫీస్‌కు దిల్ రాజు (Dil Raju) ను తీసుకెళ్లే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. ఇప్పటికే పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారని సమాచారం. నిన్న కూడా సాయంత్రం వరకూ ఫుల్ తనిఖీలు చేశారు. దిల్ రాజు కార్యాలయంతో పాటు జూబ్లీహిల్స్ ఉజాస్ విల్లాస్‌లోని ఆయన నివాసంలో సోదాలు చేపట్టారు. అలాగే రాజు కుమార్తె హన్సితారెడ్డి, సోదరుడు నర్సింహారెడ్డి.., శిరీష్ ఇళ్లల్లోనూ ఐటీ బృందాలు గాలింపు చేస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్వాహకులు నవీన్, రవిశంకర్‌లతో పాటు సీఈవో చెర్రీ ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.
Also Read: Cricket: నేటి నుంచే ఇంగ్లాండ్- భారత్ టీ 20 సిరీస్
Also Read : హనీ రోజ్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆ ఇద్దరు అధికారులు సస్పెండ్
నిన్నటి నుంచి సోదాలు...
2025 జనవరి 21వ తేదీ మంగళవారం తెల్లవారుజామునుంచే ఆయన ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దిల్ రాజు ఇల్లు,ఆఫీసుల్లో కూడా అధికారులు సోదాలు చేపట్టారు. అంతేకాకుండా ఆయన సోదరులు శిరిష్, లక్ష్మణ్, కుమార్తె, బంధువుల ఇళ్లల్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల సంక్రాంతికి రిలీజైన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam) చిత్రాలకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. బాలయ్య డాకు మహారాజ్ చిత్రానికి కూడా డిస్టిబ్యూటర్ గా వర్క్ చేశారు. దీంతో ఈ సంక్రాంతి దిల్ రాజుకు బాగానే కలిసొచ్చిందనే చెప్పాలి. టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా ఉన్న దిల్ రాజు డిస్టిబ్యూటర్ నుంచి ఎదిగారు.
Also Read: CM Chandra Babu: పెట్టుబడులకు ఆంధ్రా సూపర్..చంద్రబాబు
Also Read : ఇన్స్టా బ్యూటీ మోనాలిసాకు బంపరాఫర్.. ఏకంగా బాలీవుడ్ సినిమాలో