Kishan Reddy: కేసీఆర్‌కు ఓట్లు అడిగే హక్కులేదు.. కిషన్ రెడ్డి ఫైర్ గత 9 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. "డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై బీజేపీ పోరుబాట" కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహించింది. By Karthik 12 Aug 2023 in హైదరాబాద్ New Update షేర్ చేయండి Kishan Reddy Fired On KCR: గత 9 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. "డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై బీజేపీ పోరుబాట" కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యాలు నెరవేరలేదన్నారు. కేసీఆర్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. ఎన్నో ఆకాంక్షలతో ఏర్పడ్డ తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం చేతిలో దోపిడీకి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇరిగేషన్ నుంచి దళితబంధు(Dalit Bandhu) వరకు అంతా అవినీతి మయంగా మారిందన్నారు. తెలంగాణలో అహంకారపూరిత పాలన కొనసాగుతోందని ఎంపీ మండిపడ్డారు. రాష్ట్రంలో ల్యాండ్, స్యాండ్ మాఫియా పెద్ద ఎత్తున పెరిగిందన్నారు. 2018 ఎన్నికల ముందు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో డబుల్ బెడ్ రూమ్ (Double Bed Room) ఇళ్లు ఇస్తామని ప్రజలను మభ్యపెట్టి మోసం చేశారని కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రజలను నమ్మంచి గొంతు కోయడం కేసీఆర్ కుటుంబానికి వెన్నెతో పెట్టిన విద్య అని ఎంపీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పేదలకు ఇవ్వాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రజలకు ఇళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగమని 2018లోనే చెప్పిన కేసీఆర్‌కు ఇప్పుడు ఓట్లు అడిగే హక్కులేదని ఆయన ఆరోపించారు. ఇంటి జాగ ఉంటే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామని ప్రభుత్వం మరో డ్రామాకు తెరలేపిందన్నారు. గతంలోనే కేసీఆర్ మాటలు విని మోసపోయిన ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేరన్నారు. మరోవైపు కొత్తగా ఇళ్లు నిర్మిస్తున్నామంటూ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరంలోని 42 బస్తీలను ఖాళీ చేయించారని గుర్తు చేసిన ఎంపీ.. అక్కడ ఇంతవరకూ ఒక్క ఇళ్లు కట్టలేదని ఫైరయ్యారు. రాష్ట్రంలో ఎన్ని లక్షల ఇళ్లు కట్టినా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉందన్న ఆయన.. కేసీఆర్ మాత్రం ఇళ్లు కట్టించలేకపోతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కేవలం ఫొటోల కోసం మాత్రమే అక్కడక్కడా ఇళ్లు కట్టించారని, వాటిని కూడా గులాబీ శ్రేణులకు మాత్రమే కేటాయించారని ఆరోపించారు. మోసానికి ప్రతిరూపం కేసీఆర్ అని, అబద్దాలకు మారు పేరు కల్వకుంట్ల కుటుంబమని కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్‌ను గద్దె దించాలని ఎంపీ పిలుపునిచ్చారు. 2018 ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులను మోసం చేసిన కేసీఆర్.. ప్రస్తుతం ఎన్నికలు వస్తుండటంతో ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. దళిత, మధ్య తరగతి ప్రజలపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్న సీఎం.. పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. ప్రజలు కేసీఆర్ నియంత పాలనను గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రజలే సీఎంకు బుద్ధి చెబుతారన్నారు. Also Read: Karimnagar : డ్యాన్ చేస్తూ కుప్పకూలిన చిన్నారి..గుండు ప్రదీప్తి గుండెలో చిన్నప్పట్నుంచే రంధ్రముంది..! #bjpkishanreddy #bjp-vs-kcr #dalit-bandhu #bjp #brs #cm-kcr #mahadharna #double-bedroom #kishan-reddy-fired-on-kcr #kishan-reddy #kcr #kishan-reddy-fire-on-kcr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి