కేసీఆర్ పై కేసు.. విద్యుత్ కమిషన్ ఆదేశాలు!
TS: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధిష్టానం చెప్పినందుకే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. హరీష్ రావుపై బలమైన అభ్యర్థిని బరిలోకి దించుతామని.. ఈ నెల 12 లేదా 13న తమ మ్యానిఫెస్టోను విడుదల చేస్తామని ప్రకటించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు వెన్ను పోటు పొడుస్తోందన్నారు. రైతుకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పుడు రైతులను నిండా ముంచిందని అన్నారు.
గత 9 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. "డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై బీజేపీ పోరుబాట" కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద బీజేపీ మహాధర్నా నిర్వహించింది.