BRS MLC Kavitha: కవితకు దక్కని ఊరట..జులై 3 వరకు రిమాండ్

ఢిల్లీ లిక్కర్ స్కాం లో కవితకు ఈసారి కూడా ఊరట దక్కలేదు. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు జులై 3 వరకు జుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

New Update
MLC Kavitha: ఢిల్లీ ఎయిమ్స్‌కు కవిత.. కోర్టు కీలక ఆదేశాలు

BRS MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కాలం కల్సి రావడం లేదు. ఆమెకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. చాలా రోజుల నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న కవిత ఈరోజైనా తనకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఎదురు చూశారు. కానీ కోర్టు మాత్రం ఆమెకు వ్యతిరేకంగానే తీర్పు చెప్పింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమెకు జులై 3 వరకు జుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

నేటితో కవిత జ్యుడీషియల్ రిమాండ్ ముగియడంతో కవితను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. కవిత విషయంలో సానుభూతి చూపించొద్దని కోర్టులో ఈడీ,సీబీఐ తరుఫు లాయర్లు వాదించారు. ఈకేసులో ఇవాళ నిందితులంతా..సీబీఐ కోర్టు ముందుకు హాజరుకావాలని అంతకు ముందే న్యాయస్థానం చెప్పింది. నిందితులందరికీ ఇప్పటికే సమన్లు జారీ కూడా చేసింది. దాంతో పాటూ
ఇవాళ అనుబంధ ఛార్జ్‌షీట్‌పై కోర్టు విచారణ చేయనుంది. గత నెల 10న ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్రతోపాటు..మరో నలుగురిపై ఈడీ అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.లిక్కర్ స్కాంలో కవిత నేరాభియోగాలపై అదనపు ఛార్జ్‌షీట్ కూడా దాఖలు చేసింది. స్కాం డబ్బు గోవా ఎన్నికలకు..ఏ విధంగా చేరిందో ఛార్జ్‌షీట్‌లో ఈడీ వివరించింది.

Also Read:మధురాపూర్, బరాసత్‌లో రీపోలింగ్-ఈసీ ఆదేశం

Advertisment
Advertisment
తాజా కథనాలు