జాబ్స్ TS Teacher Jobs : 5,089 ఉద్యోగాలపై కీలక అప్డేట్.. నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త! తెలంగాణ డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది విద్యాశాఖ. 5089 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 20 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోంది. రేపటి (అక్టోబర్ 21)తో ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. ఈనేపథ్యంలో అప్లికేషన్ల గడువును మరికొన్నిరోజులు పొడిగించాలని అభ్యర్థులు విద్యాశాఖకు విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులను స్వీకరించిన విద్యాశాఖ మరోవారం పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 21 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తుల ప్రక్రియను పొడిగించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది విద్యాశాఖ. By Bhoomi 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP government jobs:ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్-3,282 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. ఏపీలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మొత్తం 18 విశ్వవిద్యాలయాల్లో 3,282 పోస్టుల భర్తీకి అక్టోబరు 20న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. By Manogna alamuru 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSLPRB Constable Recruitment: హైకోర్టు ఆర్డర్.. తెలంగాణ కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు బ్రేక్.. కానిస్టేబుల్స్ నియామక ప్రక్రియకు సంబంధించి టీఎస్ఎల్పిఆర్బి కీలక ప్రకటన చేసింది. పోలిస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో భాగంగా తదుపరి ప్రక్రియను అంటే కానిస్టేబుళ్లకు మెడికల్ టెస్టులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది బోర్డ్. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది టీఎస్ఎల్పిఆర్బి. ఈ మేరకు జిల్లాల ఎస్పీలకు, కమిషనర్లకు కూడా ఆదేశాలు జారీ చేసింది. By Shiva.K 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ APPSC GROUP-2 : భారీగా పెరగనున్న గ్రూప్-2 పోస్టులు..నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త! ఏపీలోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఏపీపీఎస్సీ గ్రూప్-2 పోస్టుల విషయంలో నిరుద్యోగులు నిరుత్సాహంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టు నెలలో గ్రూప్-2లో 508 పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే గ్రూప్-2 పోస్టుల సంఖ్యను పెంచాలంటూ చాలా మంది అభ్యర్థులు ఎపీపీఎస్సీకి విజ్ఞప్తి చేశారు. దీంతో 750పైగా గ్రూప్ 2 పోస్టులు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కొన్నిరోజుల్లో సర్కార్ నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. By Bhoomi 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ 10,391 ఉద్యోగాల దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్.. ఇలా అప్లై చేయండి! దేశ వ్యాప్తంగా ఏక లవ్య మోడల్ రెసిడెన్షియల్(ekalavya model residency) స్కూళ్ల లో ఖాళీగా ఉన్న 10,391 ఖాళీల భర్తీకి సంబంధించిన దరఖాస్తు గడువు అక్టోబర్ 19 తో ముగియనుంది. నేటితో గడువు ముగుస్తుండడంతో ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోనట్లు అయితే..వెంటనే తమ ఆప్లికేషన్స్ సమర్పించాల్సి ఉంటుంది. By Bhavana 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ DA Hike: ఉద్యోగులకు మోదీ సర్కార్ దసరా శుభవార్త.. 4 శాతం డీఏ పెంపు దేశమంతా దసరా సందడి ప్రారంభమైన వేల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది మోదీ సర్కార్. 4 శాతం డీఏ పెంపును ప్రకటించింది. By Nikhil 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ AP JOBS : ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 3,282 ఉద్యోగాలపై కీలక ప్రకటన...!! ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ప్రభుత్వం. 3,282 ఉద్యోగాలపై కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఉన్న 18 యూనివర్సిటిల్లో మొత్తం 3, 282 అధ్యాపక పోస్టుల భర్తీకి అక్టోబర్ 20న ప్రకటన వెలువరిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కే. హేమచంద్రారెడ్డి తెలిపారు. వీటితోపాటు మరో 70 పోస్టులను డిప్యుటేషన్ పై తీసుకోవాల్సి ఉంటుందన్నారు. By Bhoomi 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC Group-4 Results: గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. ఫలితాల విడుదల ఎప్పుడంటే? తెలంగాణలో 8, 180 గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రిజల్ట్స్ మెరిట్ లిస్టును విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ రెడీ అయ్యింది. ఈ ఏడాది జులై 1న రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 7.6లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన తుది కీని కూడా వెల్లడించింది. దసర పండగా తర్వాత మెరిట్ జాబితాను ఇవ్వాలని కమిషన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై హైకోర్టు స్పష్టత ఇచ్చిన తర్వాతే ఎన్నికల కోడ్ తర్వాత 1:2 నిష్పత్తి ప్రకారం ఫైనల్ లిస్టును ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే దీనిపై స్పష్టత కోసం మరింత సమయం ఆగాల్సిందే. By Bhoomi 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ IT layoffs: ఐటీ ఉద్యోగులకు షాక్.. గంటకు 23 మంది ఔట్..!! ఐటీ ఉద్యోగులకు ప్రతిరోజూ ఓ గండంలా గడుస్తోంది. ఎప్పుడు ఉద్యోగం ఉంటుందో..ఎప్పుడు ఊడుతుందో తెలియక అయోమయంలో పడ్డారు. తెల్లవారితే ఉద్యోగం ఉంది...హమ్మయ్య అని అనుకునే పరిస్థితి నెలకొంది. దీనికి కారణాలు ఉన్నాయి. ప్రపంచం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొ్ంటున్న క్రమంలో బడా, చోటా కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. ప్రాజెక్టులు తక్కువగా రావడం...కొత్త ప్రాజెక్టులపై ఆశలు లేకపోవడం వల్లే ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిగంటకు ప్రపంచవ్యాప్తంగా 23మంది ఐటీ ఉద్యోగాలు ఊడుతున్నాయి. ఐటీ కంపెనీలకు ఏ చిన్న విషయం కనిపించినా..ఉద్యోగులకే కాకకుండా దేశఆర్ధిక వ్యవస్థకు పెద్ద సవాల్ గా మారుతోంది. గంటకు 23మంది ఉద్యోగులు అంటే..మామూలు విషయం కాదు. 24గంటల్లో 552 మంది..అంటే నెలకు 30నరోజుల్లో 16వేల 560మంది ఐటీ ఉద్యోగులు ఉద్యోగాలను కోల్పోతున్నారు. By Bhoomi 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn