జాబ్స్ IDBI Jobs 2023: నిరుద్యోగులకు శుభవార్త.. ఐడీబీఐ బ్యాంక్ లో ట్రైనింగ్ తో పాటు జాబ్స్.. వివరాలివే! ఐడీబీఐ...ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 600 అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలంటే డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. పరీక్ష, ఇంటర్వ్యూలతో రిక్రూట్ జరుగుతుంది. ఇందులో సెలక్ట్ అయిన వారు ఏడాది వ్యవధితో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సు చేయాల్సి ఉంటుంది. అందులో రాణించినవారిని విధుల్లోకి చేర్చుకుంటారు. కోర్సులో ప్రతి నెలా స్టైఫెండ్ కూడా ఇస్తారు. అంతేకాదు ఉద్యోగంలో చేరిన తర్వాత ఏడాదికి 6.5లక్షలు వేతనంగా చెల్లిస్తారు. By Bhoomi 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Jobs: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఆ సంస్థలో భారీగా ఉద్యోగాలు! ఏపీ (AP) ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. పలు సంస్థల్లో ఉన్న ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్-ఏపీ) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి పిలుపునిచ్చింది. By Bhavana 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: 10th క్లాస్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఖాళీలు ఎన్నంటే.. భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో.. దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన సెక్యూరిటీ అసిస్టెంట్, ఎంటీఎస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 13లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. By B Aravind 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ SI Jobs Updates: ఎస్ఐ అభ్యర్థులకు అలర్ట్.. రిక్రూట్మెంట్ బోర్డు కీలక ప్రకటన ఏపీలో ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్షలు పూర్తయ్యాయి. పేపర్ 3,4 పరీక్షల ప్రశ్నపత్రాలతో సహా.. ప్రాథమిక కీ లను ఏపీ ఎస్ఎల్పీఆర్బీ (APSLPRB) విడుదల చేసింది. అలాగే సమాధానాలకు సంబంధించి అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే అక్టోబర్ 18 సాయంత్రం 5 గంటల్లోగా నిర్ణీత ఫార్మాట్లో మెయిల్‌కు పంపాలని తెలిపింది. ప్రశ్నా పత్రాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. By B Aravind 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana: తెలంగాణ డీఎస్సీ వాయిదా.. మళ్లీ పరీక్ష ఎప్పుడంటే.. తెలంగాణలో డీఎస్సీ పరీక్ష వాయిదా పడింది. నవంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. By Shiva.K 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Nursing: ఇంటర్ పూర్తి చేసినవారికి గుడ్ న్యూస్...కేవల రూ. 50 కడితే చాలు..జాబ్ గ్యారెంటీ..!! ఏపీలో ఇంటర్ పూర్తి చేసినవారికి గుడ్ న్యూస్. ఇంటర్ ఏ గ్రూప్ అయినా సరే ఉత్తీర్ణసాధించినవారికి నర్సింగ్ చేసేందుకు ఛాన్స్ ఇవ్వనున్నారు. ఇది కేవలం ఉమ్మడి కర్నూలు జిల్లాకు మాత్రమే వర్తిస్తుంది. ఈ జిల్లాలో ఇంటర్ పూర్తి చేసిన మహిళా అభ్యర్థులకు నర్సింగ్ చేసే ఛాన్స్ కల్పిస్తున్నట్లు ప్రభుత్వ ప్రాంతీయ శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీ నరసయ్య తెలిపారు. ఇంటర్ పూర్తి చేసి నర్సింగ్ చేయాలనుకుంటున్న వారికి ఏఎన్ఎం రెండేళ్ల కోర్సుకు సంబంధించి ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. By Bhoomi 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ APCOB Recruitment 2023: ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులో ఉద్యోగాలు..పూర్తివివరాలివే..!! ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి్ంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా 35 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు తెలుగు, ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హత కలిగి ఉంటారని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. By Bhoomi 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ SI Jobs: ఎస్ఐ నియమకాలపై హైకోర్టులో విచారణ.. అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్ ఏపీలో ఎస్ఐ నియామకాలకు సంబంధించి దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ప్రభుత్వం నిబంధనలు పాటించని కారణంగా అనేక మంది అభ్యర్థులు అర్హత కోల్పోయారని పిటిషనర్ కోర్టుకు విన్నవించారు. ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే పరీక్షలను తత్కాలికంగా వాయిదా వేయాలని కోరారు. అయితే.. ఈ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది న్యాయస్థానం. దీంతో కోర్టు తీర్పు ఎలా ఉంటుందనే అంశంపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. By Nikhil 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Govt Jobs: ఏపీలోని నిరుద్యోగులకు మంత్రి బొత్స శుభవార్త.. టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడంటే? ఏపీలో త్వరలో టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ముందు టెట్, ఆ తర్వాత డీఎస్సీ ఉంటుందని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు బొత్స. By Nikhil 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn