TS Inter Exams: ఇవాళ్టి నుంచి ఇంటర్‌ పరీక్షలు స్టార్ట్.. ఆ పొరపాటు చేయవద్దు!

తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షల కోసం 1, 521 సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్‌లోకి అనుమతి ఉండదు.

New Update
TS Inter Exams: ఇవాళ్టి నుంచి ఇంటర్‌ పరీక్షలు స్టార్ట్.. ఆ పొరపాటు చేయవద్దు!

Telangana Intermediate Exams 2024: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ఇవాళ ప్రారంభమవుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. విద్యార్థులు ఉదయం 8.45 గంటలకు సంబంధిత ఎగ్జామ్‌ సెంటర్‌లో ఉండాలి. ఉదయం 9 గంటల తర్వాత ఒక నిమిషం దాటినా ఎవరికి అనుమతి ఉండదు. ఇక ఈ ఏడాది 9,80,978 మంది విద్యార్థులు ఇంటర్‌ పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 4,78,718 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం వారుండగా, 5,02,260 మంది విద్యార్థులు ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ వాళ్లు ఉన్నారు. సెకండియర్‌ పరీక్షలకు హాజరయ్యే వారిలో 58,071 మంది ప్రైవేట్‌ విద్యార్థులున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు 1,521 సెంటర్లను ఏర్పాటు చేశారు.

వివరాలు:
--> పరీక్షాకేంద్రాలు : 1 ,521
--> చీఫ్‌ సూపరింటెండెంట్లు : 1,521
--> ఇన్విజిలెటర్లు : 27,900
--> ఫ్లయింగ్‌ స్కాడ్‌ : 75
--> సిట్టింగ్‌ స్కాడ్‌ : 20

నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో విద్యార్థులు త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 6 నుంచే ఆర్టీసీ బస్సు(RTC Bus) లను అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ ఆర్టీసీ అధికారులను కోరారు. నిమిషం నిబంధన అమల్లో ఉండడంతో విద్యార్థులు త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 6 నుంచే ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ ఆర్టీసీ అధికారులను కోరారు. విద్యార్థులకు ప్రతి పరీక్షా కేంద్రంలో ప్రథమ చికిత్స అందించేందుకు ఒక ఏఎన్‌ఎంను నియమించి నిరంతర విద్యుత్‌ సరఫరా చేయనున్నారు. విద్యార్థులు ఎవరూ కూడా పరీక్షా కేంద్రాలకు సెల్‌ ఫోన్లు తీసుకురావొద్దని, ఒకవేళ ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో మొబైల్‌ ని తీసుకుని వస్తే మాత్రం సెంటర్ల వద్ద భద్రత అధికారులుకు ఇవ్వాలని తెలిపారు. అధికారులు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది సెల్‌ ఫోన్లను లోపలికి తీసుకురాకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఇంటర్‌ పరీక్షల్లో ఈ రూల్స్ కచ్చితంగా పాటించాల్సిందే:

మరో రెండు రోజుల్లో తెలంగాణ ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో అధికారులు విద్యార్థులకు కొన్ని కీలక సూచనలు చేశారు.

- విద్యార్థులు తమతో పాటు కచ్చితంగా హాల్‌ టికెట్‌ తీసుకుని రావాలి

- మొబైల్స్, ఎలక్ట్రానిక్‌ వస్తువులను తీసుకురాకూడదు.

- ఎగ్జామ్‌ సెంటర్‌ కు 45 నిమిషాల ముందే చేరుకోవాలి.

- ఒక్క నిమిషం లేటైనా లోనికి అనుమతి లేదు.. అనే నిబంధనను దృష్టిలో పెట్టుకోవాలి.

- ఇంటి వద్ద నుంచి ముందుగానే బయల్దేరాలి. లేకపోతే ట్రాఫిక్ లో ఇరుక్కునే ప్రమాదం ఉంది.

- ప్యాడ్ లు వంటివి ఎగ్జామ్‌ హాల్‌ లోనికి అనుమతి లేదు.

Also Read: నేడు జాతీయ సైన్స్ దినోత్సవం.. సెల్యూట్‌ ‘సర్’ సీవీ రామన్!
WATCH:

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు