Sir CV Raman Effect: ఫిబ్రవరి 28.. ఇది దేశానికి చాలా ప్రత్యేకమైనద రోజు. భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్త సర్ సీవీ రామన్ గౌరవార్థంగా ఈ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. 1928లో ఫిబ్రవరి 28న సీవీ రామన్ ‘రామన్ ఎఫెక్ట్’ను కనుగొన్నట్లు ప్రకటించారు. ఈ ఆవిష్కరణకు 1930లో ఆయన నోబెల్ బహుమతి పొందారు. ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డేగా జరుపుకోవాలని 1986లో అప్పటి ప్రభుత్వం తొలిసారిగా ప్రకటించింది.
లక్ష్యమేంటి?
ఈ తేదీని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకోవడానికి ప్రాథమిక లక్ష్యం దేశంలోని విద్యార్థులను సైన్స్ రంగంలో కొత్త ప్రయోగాలకు ప్రేరేపించడం. అంతేకాదు వారిని సైన్స్ వైపు ఆకర్షించడం, వైజ్ఞానిక విజయాలపై వారికి అవగాహన కల్పించడం.
సెల్యూట్ సర్:
సీవీ రామన్ పూర్తి పేరు చంద్రశేఖర్ వెంకట రామన్. ఆయన నవంబర్ 7, 1888న తమిళనాడులో జన్మించారు. 1907లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఎంఎస్సీ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించారు. 1933 వరకు కలకత్తాలోని ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్‌లో పనిచేశారు. భౌతిక శాస్త్రానికి సంబంధించిన వివిధ అంశాలపై పరిశోధన చేశారు.
National Science Day: నేడు జాతీయ సైన్స్ దినోత్సవం.. సెల్యూట్ ‘సర్’ సీవీ రామన్!
ఇవాళ నేషనల్ సైన్స్ డే. 1928లో ఫిబ్రవరి 28న సీవీ రామన్ 'రామన్ ఎఫెక్ట్'ను కనుగొన్నట్లు ప్రకటించారు. ఈ ఆవిష్కరణకు 1930లో సైన్స్‌లో రామన్‌కు నోబెల్ బహుమతి లభించింది. నేటికీ రసాయనాల పరమాణు నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి రామన్ ఎఫెక్ట్ ఒక ముఖ్యమైన సాధనం.
Translate this News: