/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-01T190654.340-jpg.webp)
Telangana Tet 2025 results released
TS TET: తెలంగాణ టెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలకు హాజరైన టీచర్ అభ్యర్థులు tstet2024.aptonline.in లేదా schooledu.telangana.gov.in లో రిజల్ట్స్ చూసుకోవచ్చు.
రిజల్ట్స్ ఎలా చూసుకోవాలంటే..
1. మొదటగా అధికారిక వెబ్‌సైట్ tstet2024.aptonline.inను సందర్శించండి.
2. హోమ్‌పేజీలో 'Download Results - TSTET 2024' పై క్లిక్ చేయండి.
3. అభ్యర్థికి సంబంధించిన వివరాలను అందించాల్సిన కొత్త లాగిన్ పేజీలోకి ఎంటర్ అవుతారు.
4. క్లిక్ ఆన్ సబ్మిట్ పై నొక్కగానే మార్కులు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
తెలంగాణ విద్యాశాఖ 2025 జనవరి 2 నుంచి 20 వరకు టెట్ పరీక్షలను ఆన్ లైన్ విధానంలో నిర్వహించింది. జనవరి 27న ప్రిలిమినరీ కీలపై విద్యాశాఖ అభ్యంతరాలను స్వీకరించింది. మొత్తం 31.21 శాతం మంది అభ్యర్థులు టెట్ పరీక్షలో అర్హత సాధించారు. 1,35,802 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాయగా 42,384 మంది అర్హత సాధించారు.
ALSO READ: TDPలో మంగ్లి చిచ్చు.. కేంద్ర మంత్రి రామ్మోహన్ పై దుమ్మెత్తి పోస్తున్న కేడర్!
మెగా డీఎస్సీకి రంగం సిద్ధం..
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగా ప్రతి సంవత్సరం రెండు సార్లు టెట్ పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. ఈ విద్యా సంవత్సరం (2024-25) రెండు సార్లు టెట్ పరీక్షలు నిర్వహించింది. ఇక డీఎస్సీ నోటిఫికేషన్ 2025 ఫిబ్రవరిలో విడుదల చేస్తామని తెలిపినప్పటికీ ఎస్సీ వర్గీకరణ అంశం తెరమీదకు రావడంతో ఏప్రిల్ కు వాయిదా వేసింది. ఈసారి డీఎస్సీలో 6 వేల టీచర్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది.
ALSO READ: YS Viveka Murder Case: వివేక హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. మరో నలుగురిపై కేసు!
ALSO READ: Prabhakar: 'సరిపోదా గురువారం'.. నాని సినిమా ఆదర్శంగా క్రిమినల్ ప్రభాకర్ ఆగడాలు!
ALSO READ: చాట్‌జీపీటీ, డీప్‌సీక్ వాడొద్దు.. కేంద్రం సంచలన ప్రకటన