/rtv/media/media_files/2025/01/29/faVusmjsQLUCmucx0hCm.jpg)
RRC ECR Apprentice Recruitment 2025
RRC: రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో గుడ్ న్యూస్ RRC భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దాదాపు 1,154 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే?.. ఇది కేవలం అప్రెంటిస్ నోటిఫికేషన్ మాత్రమే. బిహార్ రాష్ట్రం, పట్నలోని ఈస్ట్ సెంట్రల్ రైల్వే, ఆర్ఆర్‌సి ఈ అప్రెంటిస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని డివిజన్, యూనిట్‌లలో యాక్ట్ అప్రెంటిస్ ట్రైనింగ్ కోసం అర్హులు, ఆసక్తి గల అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
Also Read: ప్లీస్ నా మాట వినండి.. భక్తులకు సీఎం యోగి కీలక విజ్ఞప్తి!
యాక్ట్ అప్రెంటిస్ మొత్తం ఖాళీలు: 1,154
డివిజన్ల వారీగా
దానాపూర్: 675
ధన్‌బాద్: 156
క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, హర్నాట్: 110
పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్: 64
సోన్‌పూర్: 47
Also Read: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అమృత స్నానాలపై అఖండ పరిషత్ కీలక నిర్ణయం
సమస్తిపూర్: 46
ప్లాంట్ డిపో (Pt దీన్ దయాళ్): 29
మెకానికల్ వర్క్‌షాప్, సమస్తిపూర్: 27
ట్రేడ్‌లు: ఫిట్టర్, వెల్డర్, మెకానిక్ (డీజిల్), మెషినిస్ట్, లైన్‌మ్యాన్, వైర్‌మ్యాన్, కార్పెంటర్, ఎంఎంటీఎం, ఎలక్ట్రానిక్ మెకానిక్, టర్నర్, ఫోర్జర్ అండ్ హీట్ ట్రీటర్, సివిల్ ఇంజినీర్, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్, పెయింటర్, ఎలక్ట్రీషియన్ తదితర ట్రేడుల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
Also Read: కుంభమేళాలో తొక్కిసలాట.. కన్నీరు పెట్టించే దృశ్యాలు..!
విద్యార్హత: కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత లేదా మెట్రిక్యులేషన్ విద్యార్హత కలిగి ఉండాలి. వీటితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. NCVT జారీచేసిన నేషనల్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ పొంది ఉండాలి.
వయోపరిమితి: 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా కొందరిని సెలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత మెడికల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు ప్రారంభ తేది: జనవరి 25, 2025
దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 14, 2025