/rtv/media/media_files/2025/02/24/cLmHjm2pyd8iNQajD5wW.jpg)
rrb recruitment 2025 application deadline extended of 32438 posts
RRB Group D Recruitment: నిరుద్యోగులకు రైల్వే శాఖ ఇటీవల గుడ్ న్యూస్ చెప్పింది. భారీ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో సుమారు 32,438 లెవెల్ - 1 (గ్రూప్-డి) ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. పలు విభాగాల వారీగా పోస్టులు నిర్ణయించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జనవరి 23 నుంచి ప్రారంభం అయింది. ఫిబ్రవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చని రైల్వే శాఖ తెలిపింది. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు గడువును రైల్వే శాఖ పొడిగించింది. మార్చి 1వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మార్చి 4 నుంచి 13 మధ్య ఎడిట్ చేసుకోవచ్చని పేర్కొంది. అందువల్ల ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది.
ఇది కూడా చూడండి: ఒకే వేదికపై తమిళ్ హీరో విజయ్ దళపతి, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
విభాగాలు:
అసిస్టెంట్ (ఎస్ అండ్ టీ), అసిస్టెంట్ (Work Shop), అసిస్టెంట్ లోకో షెడ్ (Diesel), అసిస్టెంట్ లోకో షెడ్ (Electrical), అసిస్టెంట్ ఆపరేషన్ (ఎలక్ట్రికల్), అసిస్టెంట్ బ్రిడ్జ్, అసిస్టెంట్ క్యారేజ్ అండ్ వ్యాగన్, అసిస్టెంట్ పీవీ, అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ (వర్క్ షాప్), అసిస్టెంట్ టీఎల్ అండ్ ఏసీ, అసిస్టెంట్ ట్రాక్ మెషిన్, అసిస్టెంట్ టీఆర్ డీ, పాయింట్స్ మెన్ బీ ట్రాక్ మేనేజర్-4 పోస్టులు ఉన్నాయి.
ఇది కూడా చూడండి: National: సిద్ధాంతాలు తుంగలో తొక్కేసిన కమ్యూనిస్టు పార్టీ.. బీజేపీతో దోస్తీకి సై!
రీజియన్లు:
బెంగళూరు, భోపాల్, ముంబయి, పట్నా, భువనేశ్వర్, అహ్మదాబాద్, అజ్‌మేర్, బిలాస్‌పూర్, కోల్‌కతా, గోరఖ్‌పుర్, ప్రయాగ్‌రాజ్, మాల్దా, రాంచీ, సికింద్రాబాద్, చండీగఢ్, చెన్నై.
అర్హత:
10వ తరగతి అర్హతతో అభ్యర్థులు గ్రూప్ డీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే టెక్నికల్ డిపార్ట్మెంట్లకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT) ఇచ్చిన న్యాక్ లేదా ఐటీఐ డిప్లొమా తప్పనిసరి. అలాగే నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
ఇది కూడా చూడండి: Aadi Pinishetty: భార్యతో ఆది పినిశెట్టి విడాకులు.. అసలు విషయం బయటపెట్టిన హీరో
వయోపరిమితి:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 36 ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపిక విధానం:
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌తో పాటు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ఉంటుంది. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.
ఆన్‌లైన్ ప్రారంభ తేదీ: 23.01.2025.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22.02.2025. (01.03.2025 వరకు పొడిగించారు)