/rtv/media/media_files/8QCEUhL6SHJqpa1NPcak.jpg)
Jobs
నేటి కాలంలో ఒక్క ఉద్యోగం కోసం యువత ఎంతగానో కష్టపడుతోంది. ఉద్యోగాలు తక్కువగా ఉంటే వాటి కోసం పోటీపడేవారు లక్షల్లో ఉన్నారు. దీంతో ఉద్యోగాలు దొరకకపోవడంతో యువత ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు ఏఐ ఒకటి. ఇప్పటికే లేఆఫ్‌లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ఏఐ వల్ల భవిష్యత్తులో కూడా ఉద్యోగాలకు చాలా వరకు కొరత(AI Jobs Impact) ఏర్పడుతుందని నిరుద్యోగులు భయపడుతున్నారు. అయితే దేశంలో ఉద్యోగాలు పెరుగుతాయని ఇటీవల నౌకరీ(Naukri Survey) సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ ఏడాది అక్టోబరు 2025 నుంచి మార్చి 2026 వరకు ఉద్యోగ అవకాశాలు బాగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఈ సర్వేలో దాదాపుగా 1,300 మంది కంపెనీ యజమానులు పాల్గొన్నారు. వీరిలో 72% మంది తమ సంస్థల్లో కొత్త ఉద్యోగులను తీసుకోవాలని భావిస్తున్నట్లు నౌకరీ తెలిపింది. దీనివల్ల నిరుద్యోగ సమస్య కొంతవరకు తగ్గుతుందని నౌకరీ తెలిపింది.
ఇది కూడా చూడండి: Bank Jobs: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. దేశంలో 2.5 లక్షల బ్యాంక్ జాబ్స్!
While U.S. headlines scream “AI will kill jobs”…
— Amanda Goodall (@thejobchick) August 22, 2025
72% of Indian employers are adding net new roles in H2 2025.
Not replacement. Expansion y’all.
Global labor narratives are diverging… and fast. 👇
(a thread)
ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయా?
చాలామందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం ఉంది. అయితే ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయం ఒకటి వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న యజమానులలో 87% మంది ఏఐ వల్ల ఉద్యోగాలు తగ్గుతాయనే భయం తమకు లేదని చెప్పారు.13% మంది మాత్రం ఏఐ వల్ల ఉద్యోగాలు తగ్గడం కాదు, ఇంకా పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. అయితే ఏఐ వల్ల ఎక్కువగా ఐటీ (42%), డేటా అనలిటిక్స్ (17%), బిజినెస్ డెవలప్‌మెంట్ (11%) వంటి రంగాల్లో కొత్త ఉద్యోగాలు పెరుగుతాయని ఈ సర్వేలో తేలింది.
ఈ టెక్నాలజీలకు డిమాండ్
ప్రస్తుతం మార్కెట్‌లో కొత్త టెక్నాలజీలకు భారీ డిమాండ్ ఉంది. ముఖ్యంగా మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఏఐ వంటి రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయని, వీటికి సంబంధించిన టెక్నాలజీలు నేర్చుకోవడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఫ్రెషర్స్ కంటే అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. 4 నుంచి 7 సంవత్సరాల అనుభవం ఉన్నవారిని నియమించుకోవడానికి 47% కంపెనీలు ఆసక్తి చూపించాయి. ఇక కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకుంటున్న వారిని తీసుకోవడానికి 29% కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. 8 నుంచి 12 సంవత్సరాల అనుభవం ఉన్నవారిని 17% కంపెనీలు, 13 నుంచి 16 సంవత్సరాల అనుభవం ఉన్నవారిని కేవలం 3% కంపెనీలు మాత్రమే తీసుకోవాలని భావిస్తున్నాయి. దీనివల్ల మధ్యస్థ స్థాయి అనుభవం ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయని తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: BANK JOBS: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. 750 బ్యాంక్ జాబ్స్‌కు నోటిఫికేషన్!