Bank Jobs: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. దేశంలో 2.5 లక్షల బ్యాంక్ జాబ్స్!

2030 నాటికి బ్యాంకింగ్ రంగంలో 10 శాతానికి ఉద్యోగాలు చేరుకుంటాయని అంచనా వేసింది. ఇలా చూసుకుంటే దాదాపుగా 2.5 లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో వస్తాయని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. టైర్ 2, టైర్ 3 నగరాల్లో బాగా డిమాండ్ పెరగడం వల్ల ఉద్యోగాలు పెరుగుతాయని తెలిపింది.

New Update
BFSI

BFSI

నేటి కాలంలో ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఉద్యోగం సంపాదించాలంటే చాలా కష్టం. ఒక వంద ఉద్యోగాలకు లక్షల్లో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎంత కష్ట పడినా కూడా ఏ లక్షల్లో ఒకరికి ఉద్యోగాలు వస్తున్నాయి. దీనికి తోడు ఐటీ రంగంలో లేఫ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రముఖ కంపెనీలు ఇప్పటికే వేలకు మందికి పైగా తొలగించింది. అలాగే ఏఐ వల్ల కొన్నేళ్ల తర్వాత ఉద్యోగాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు షాక్‌లో ఉన్నారు. అలాంటి వారికి బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ (BFSI) గుడ్ న్యూస్ తెలిపింది. 

ఇది కూడా చూడండి: Stock Market: ఊపుమీదున్న బజాజ్, రిలయెన్స్ షేర్లు..వరుసగా నాలుగో రోజులు లాభాల్లో మార్కెట్

ఐదేళ్లలో 2 లక్షల 50 వేల ఉద్యోగాలు..

2025-26లో నియామకాలు 8.7 శాతం పెరుగుతాయని వెల్లడించింది. 2030 నాటికి బ్యాంకింగ్ రంగంలో 10 శాతానికి ఉద్యోగాలు(bank-jobs) చేరుకుంటాయని అంచనా వేసింది. ఇలా చూసుకుంటే దాదాపుగా 2.5 లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలో వస్తాయని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. అయితే బ్యాంకింగ్ ఉద్యోగాలకు టైర్ 2, టైర్ 3 నగరాల్లో బాగా డిమాండ్ పెరుగుతోంది. దీంతో బ్యాంకింగ్ రంగంలో 2.5 లక్షలు కొత్త ఉద్యోగాలు వస్తాయని ఓ నివేదిక తెలిపింది. అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 27 శాతం పెరిగాయి. ఇలా నియామకాలు పెరగడం వల్ల నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని తెలిపింది. 

ఈ రంగంలో కొన్ని కేటగిరీల వారికి డిమాండ్ పెరగడంతో..

ఎక్కువగా సంపద, బీమా సంస్థలు, ఆర్థిక ప్రణాళికదారులు, పెట్టుబడి సలహాదారులు, డిజిటల్ అండర్ రైటర్లు, క్లెయిమ్ ఆటోమేషన్, బ్యాంకింగ్‌లో సేల్స్, హెల్త్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, డిజిటల్ ప్రొడక్ట్ మేనేజర్లు, క్రెడిట్ రిస్క్ నిపుణులను ఎక్కువగా కోరుకుంటున్నాయని నివేదిక వెల్లడించింది. వచ్చే ఐదేళ్లలో ఈ కేటగిరిలో ఎక్కువగా ఎక్కువగా ఉద్యోగాలు పెరుగుతాయని తెలిపింది. ఇటీవల కోయంబత్తూర్, ఇండోర్, గౌహతి, నాగ్‌పూర్ వంటి నగరాల్లో కూడా 15-18 శాతం నియామకాలు పెరిగాయని వెల్లడించింది. సూరత్, జైపూర్, లక్నో, భువనేశ్వర్‌లలో అయితే 11-13 శాతం పెరిగాయని నివేదిక తెలిపింది. 

ఇది కూడా చూడండి: LIC Recruitment: నెలకు లక్షకు పైగా జీతంతో ఎల్‌ఐసీలో భారీగా ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఆ రోజే!

Advertisment
తాజా కథనాలు