/rtv/media/media_files/2025/03/07/7ryrdJcPh2oEeZNZUKco.jpg)
Nara Lokesh
కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఇప్పటికే దరఖాస్తు స్వీకరణ కూడా ప్రారంభమైంది. అభ్యర్థులు ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాలి. అయితే డీఎస్సీకి అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం మంత్రి నారా లోకేష్ ప్రత్యేకమైన వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియో చూసి స్టెప్ బై స్టెప్ ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
ఇది కూడా చూడండి: 10th Class Students: ఆన్సర్ షీట్లో రూ.500.. ఛాయ్ తాగి నన్ను పాస్ చేయండి - 10th క్లాస్ స్టూడెంట్స్ అరాచకం
Another promise kept!
— Lokesh Nara (@naralokesh) April 20, 2025
The Mega DSC Notification for 16,347 teacher posts has been released.
Online Application submission is LIVE.
📥 Application Portals:
👉 https://t.co/xMSx9NycwQ
👉 https://t.co/acflj2kIh3
For a smooth application process, please refer to the video and… pic.twitter.com/DTCoGEE0fW
ఇది కూడా చూడండి: మహిళా కమిషన్ లాగే.. పురుషులకు ప్రత్యేక కమిషన్ కావాలని డిమాండ్
స్టెప్ బై స్టెప్..
మెగా డీఎస్సీకి అప్లై చేయాలంటే ఫస్ట్ మీరు డిపార్ట్‌మెంట్ ఆప్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్‌ను క్లిక్ చేసి కొత్త యూజర్లు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
రిజిస్ట్రేషన్ లింక్ క్లిక్ చేయగానే ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ వస్తుంది.
దీని తర్వాత డీఎస్సీకి అప్లై చేసుకోవడానికి లాగిన్ కావాలి.
ఆ తర్వాత సెక్షన్ 1, సెక్షన్ 2లో వివరాలు పొందుపరచాలి. స్కూల్ నుంచి బీఈడీ వరకు అన్ని సర్టిఫికేట్లు వివరాలను అందించాలి.
ఇది కూడా చూడండి: Paster praveen: పోలీసులకు వ్యతిరేకంగా KA పాల్ అనుమానాలు.. ఆర్టీవీతో ఎక్స్‌క్లూసివ్ వీడియో
అలాగే ఏపీ టెట్ క్వాలిఫికేషన్ వివరాలను పొందుపరచాలి.
చివరిలో వెరిఫికేషన్ చెక్ బాక్స్‌కు టిక్ పెట్టి వెరిఫై చేయాలి.
ఆ తర్వాత సెక్షన్ 3లో జిల్లా, జోన్‌ను కూడా సెలక్ట్ చేసుకోవాలి.
ఎగ్జామ్ సెంటర్ ఆప్షన్స్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
మొత్తం అయిన తర్వాత ఒకే కొట్టి, చెక్ చేసుకుని ప్రోసీడ్ టూ పే అనే ఆప్షన్ క్లిక్ చేయాలి.
వెంటనే పేమెంట్ పేజీ ఓపెన్ అవుతుంది. దీనిలో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్స్ మెథడ్స్ ద్వారా పేమెంట్స్ చేసుకోవచ్చు.
మొత్తం ప్రాసెస్ పూర్తయిన తర్వాత డాక్యుమెంట్ అప్‌లోడింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయాలి. చివరిగా అప్లికేషన్ ఫామ్‌ను ప్రింట్ తీసుకోవాలి.
ఇది కూడా చూడండి: Saraswati Pushkaralu: సరస్వతీ పుష్కరాలు-2025.. సర్కార్ ప్రత్యేక యాప్..ఒక్క క్లిక్ చాలు!