కాంగ్రెస్ కు షర్మిల ఇచ్చిన గడువు ఈరోజుతో ముగుస్తోంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని షర్మిల అడిగారు. సెప్టెంబర్ 30లోపు ఏదోకటి తేల్చాలని చెప్పారు. కానీ ఆ విలీనానికి బ్రేక్ పడినట్టే అనిపిస్తోంది. మొన్నటి వరకు ఇదిగో విలీనం అదిగో విలీనం అంటూ కబుర్లు చెప్పిన వైఎస్ఆర్టీపీ వర్గీయులు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. రీసెంట్ గా లోటస్ పాండ్ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో పార్టీ అధినేత్రి షర్మిల చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఒంటరి పోరు తప్పదని...తమ పార్టీ అభ్యర్ధులు 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని షర్మిల ప్రకటించింది.
కర్ణాటకలో కాంగ్రెస్ విజయంతో ఆ పార్టీలో విలీనానికి షర్మిల ఒప్పుకున్నారు. కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకె శివకుమార్ ద్వారా చక్రం తిప్పడానికి ట్రై చేశారు. కానీ వర్కౌట్ అవ్వకపోవడంతో డైరెక్ట్ గా సోనియా, రాహుల్ గాంధీని కలిశారు. అయినా కూడా ఇప్పటి వరకు అధిష్టానం నుంచి ఎలాంటి రెస్పాండ్ రాలేదు. అందుకే సెప్టెంబర్ 30 వరకు షర్మిల గడువు విధించారని తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఒంటరిగానే బరిలోకి దిగాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అంతేకాదు అక్టోబర్ 2 వారం నుంచి ప్రజల మధ్యలో ఉండాలని కార్యాచరణ కూడా ఫిక్స్ చేసుకున్నారని చెబుతున్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రది ఒక్కరికీ ఫ్రాధాన్యత ఉంటుందని షర్మిల చెప్పారని అంటున్నారు.
మరోవైపు కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనంలో కాంగ్రెస్ స్టేట్ లీడర్ల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా షర్మిల చేరికకు రేవంత్ వర్గం వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. విలీనం ప్రతిపాదనను రేవంత్ టీమ్ లైట్ తీసుకున్నారని అంటున్నారు. వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ లో చూేరితే నష్టమని రేవంత్ వర్గం భావిస్తోందిట. అదే కాక షర్మిల పాలేరు నుంచి పోటీ చేస్తా అనడం కూడా ఇబ్బందిగా మారింది. అందుకే గడువు ముగుస్తున్నా ఇప్పటివరకూ అసలు దాని వూసే ఎత్తడం లేదని సమాచారం. హైకమాండ్కు దీని గురించి నివేదికలు కూడా పంపినట్లు తెలుస్తోంది. దీనికి తోడు పార్టీలో షర్మిల వన్ వుమెన్ షో తప్పితే అసలు బలమే లేదు. ఇది కూడా విలీనానికి మైనస్ అయిందని చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ఈరోజుతో వైఎస్ఆర్టీపీ, కాంగ్రెస్ లో చేరుతుందో లేదో తెలిసిపోతుంది. దాన్ని బట్టి షర్మిల నిర్ణయాన్ని కూడా ప్రకటిస్తారని అంటున్నారు వైఎస్ ఆర్టీపీ వర్గీయులు. విలీనం లేకపోతే ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతారని తెలుస్తోంది.