ఐపీఎల్(IPL)లో ఆయా జట్ల ఆటగాళ్ల రిటెన్షన్ కోసం బీసీసీఐ పెట్టిన డెడ్‌లైన్ ఇవాళ్టి(నవంబర్ 26)తో ముగియనుంది. దీంతో ఏ ఏ జట్లలో ఏ ఆటగాళ్లను ఉంచుతున్నారు ఏ ఆటగాళ్లను రిటైన్ చేస్తున్నారన్నదానిపై ఫ్యాన్స్‌లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ప్రధాన జట్లైన ముంబై, చెన్నైతో పాటు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు సంబంధించిన న్యూస్ అప్‌డేట్లపై ఫ్యాన్స్ ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. డిసెంబర్ 19న జరిగేది మినీ వేలమే అయినా ఈసారి తమ ఫేవరెట్ ప్లేయర్లు తమ జట్లలో ఉన్నారా లేదా అన్నదానిపై సాధారణంగానే ఆసక్తి ఉంటుంది. అటు సోషల్‌మీడియాలో రిటెన్షన్, లీవ్‌కి సంబంధించిన పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో ప్రధానంగా ఉన్నావాటిపై ఓ లుక్కెయండి!
టాప్ ప్లేయర్ల విడుదల/పుకార్లు:
శార్దూల్ ఠాకూర్: ఆల్ రౌండర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ రూ10.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ వేలానికి ముందు భారత స్టార్‌ను విడుదల చేయడానికి ఫ్రాంచైజీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. పర్సులో కాస్త బ్యాలెన్స్ ఉంచుకునేందుకు శార్దూల్‌ను కేకేఆర్ లీవ్ చేస్తుందని వార్తలు షికార్లు చేస్తున్నాయి.
పృథ్వీ షా: గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన పృథ్వీ షా ఫ్లాప్ అయ్యాడు. దీంతో అతడిని ఢిల్లీ వదిలేస్తుందన్న ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఎలాంటి స్పష్టమైన క్లారిటీ లేదు. షాను ఫ్రాంచైజీ తన వద్దే ఉంచుకోనున్నట్లు తెలుస్తోంది.
హార్దిక్ పాండ్యా: గుజరాత్ టైటాన్స్‌ను ఒకసారి ఛాంపియన్‌గా, మరోసారి రన్నరప్‌గా నిలిపిన హార్దిక్ పాండ్యా మళ్లీ తన సొంతగూడు ముంబై ఇండియన్స్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. అయితే హార్దిక్ ముంబైకి కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడా లేదా రోహిత్ శర్మ టీమ్‌లో సభ్యుడిగా ఉంటాడా అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఫ్యాన్స్ కూడా ఎక్కువగా ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు.
Also Read: షమీ గొప్ప మనసు.. యాక్సిడెంటైన వ్యక్తిని ఎలా కాపాడాడో చూడండి!
WATCH: