Shami Video: షమీ గొప్ప మనసు.. యాక్సిడెంటైన వ్యక్తిని ఎలా కాపాడాడో చూడండి! టీమిండియా వరల్డ్‌కప్ హీరో, స్టార్ పేసర్ మహ్మద్ షమీపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నైనిటాల్ సమీపంలో యాక్సిడెంట్‌కు గురైన ఓ వ్యక్తిని షమీ కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. By Trinath 26 Nov 2023 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Mohammed Shami: మహ్మద్ షమీ .. ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది.. తానెంటో ఈ వరల్డ్‌కప్ ఎడిషన్ ద్వారా ప్రపంచానికి చూపించాడు. వరల్డ్‌కప్ చరిత్రలోనే అత్యుత్తుమ బౌలర్‌గా నిలిచిన షమీ మరో సారి వార్తల్లో నిలిచాడు. వన్డే ప్రపంచ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించిన షమీ.. నైనిటాల్‌లో ప్రమాదానికి గురైన వ్యక్తిని రక్షించాడు. ఈ భారత పేస్ స్టార్ షేర్ చేసిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాడు. 'అతను చాలా అదృష్టవంతుడు, దేవుడు అతనికి రెండో జీవితాన్ని ఇచ్చాడు.. అతని కారు నానిటాల్ సమీపంలోని కొండ రహదారి నుండి నా కారు ముందు పడింది.. మేము అతన్ని చాలా సురక్షితంగా బయటకు తీశాము' అని షమీ ఇన్‌స్టా ఓ వీడియో షేర్ చేశాడు. View this post on Instagram A post shared by 𝕸𝖔𝖍𝖆𝖒𝖒𝖆𝖉 𝖘𝖍𝖆𝖒𝖎 (@mdshami.11) దేవుడు మరో జీవితాన్ని ఇచ్చాడు: రెస్క్యూ వీడియోను షేర్ చేయడానికి ఈ స్పీడ్‌స్టర్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు వెళ్లాడు. నైనిటాల్‌లోని కొండ రహదారి గుండా వ్యక్తి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అతని కారు స్కిడ్ అయ్యింది. బోల్తా పడింది. ఆ కారు వెనకనే వస్తున్న షమీతో అక్కడున్న వారు అతడిని రక్షించారు. ఆస్పత్రికి తరలించారు. షమీ రికార్డుల ఊచకోత: ఈ వరల్డ్‌కప్‌లో షమీ (Mohammed Shami) ఎన్నో రికార్డును క్రియేట్ చేశాడు. సింగిల్ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత్ బౌలర్‌గా నిలిచాడు. వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక సార్లు ఒక్కటే ఇన్నింగ్స్ 5 వికెట్లు తీసిన బౌలర్ షమీనే. ఈ ఒక్క వరల్డ్‌కప్‌లోనే షమీ మూడు సార్లు 5 వికెట్లు పడగొట్టాడు. వరల్డ్‌కప్‌ల్లో వేగంగా 50 వికెట్లు పూర్తి చేసుకున్న బౌలర్‌గా షమీ నిలిచాడు. వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో 17 ఇన్నింగ్స్‌లో నాలుగు సార్లు ఐదు వికెట్లు కూల్చాడు షమీ. ఐసీసీ ఈవెంట్లలో ఇదే అత్యుత్తుమం. ఈ వరల్డ్ కప్‌లో షమీకి మూడు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. బ్యాటింగ్‌కు స్వర్గధామం లాంటి పిచ్‌లపై షమీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు అందుకున్నాడంటే అతనిలో పట్టుదల ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. Also Read: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య? ఏబీ డివిలియర్స్ ఏమన్నారంటే WATCH: #icc-world-cup-2023 #mohammad-shami మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి