SRH VS LSG: నీ జిడ్డాటకో దండం..ఆయన ప్రవర్తనకు మరో దండం.. నిన్న హైదరాబాద్‌లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో సన్ రైజర్స్ అక్నో జెయింట్స్‌ను చిత్తుగా ఓడించింది. ఆరెంజ్ ఆర్మీ అద్భుతంగా ఆడడం ఓ ఎత్తైతే..లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ జిడ్డాట మరో ఎత్తు. వీళ్ళద్దరి కన్నా లక్నో ఓనర్ గోయెంకా..జట్టు కెప్టెన్‌ను బహిరంగంగా తిట్టడం అన్నింటికన్నా హైలెట్. By Manogna alamuru 09 May 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Sanjiv Goenka Angry Over KL Rahul : నిన్న హైదరాబాద్ ఉప్పల్ లో జరిగిన ఎస్ఆర్‌హెచ్, జెయింట్స్ (SRH VS LSG) మ్యాచ్‌లో అన్నీ సంచలనాలే. అంతా వింతే. చాలా కీకలమైన మ్యాచ్‌లో సన్ రైజర్స్ అద్భుతంగా ఆడింది. లక్నో ఇచ్చిన టార్గెట్‌ను కేవలం 9.4 ఓవర్లలోనే 167 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. దీంతో ఆ టీమ్ ప్లే ఆఫ్స్‌కు చేరుకుంది. అంతకుముందు లక్నో జెయింట్స్ 20 ఓవర్లు ఆడి 4 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్‌లో చాలా తక్కువ స్కోరు. అందులోనూ ఎమంచి ఫామ్‌లో ఉన్న ఎస్‌ఆర్‌హెచ్ లాంటి టీమ్‌లకు ఇంత చిన్న టార్గెట్‌లు ఇవ్వకూడదు. పెద్ద పెద్ద లక్ష్యాలనే అలవోకగా ఆడి పడేస్తున్నారు సన్‌రైజర్స్ టీమ్ వాళ్ళు. అలాంటి వాళ్ళకు ఇంత చిన్న స్కోరు ఇస్తే...చిన్న పిల్లలను కొట్టిపడేసినట్టు..పడేయరూ. నిన్న లక్నో జెయింట్స్ టీమ్‌కు ఈ అనుభవమే ఎదురయింది. ఇదేం జిడ్డు రా నాయనా... ఈ ఐపీఎల్ తర్వాత విండీస్, యూఎస్ వేదికగా టీ20 ప్రపంచకప్ (T20 World Cup) జరగనుంది. క్రికెట్ లవర్స్ ఫోకస్ అంతా ఈ మెగాటోర్నీపై షిఫ్ట్ అయింది. తాజాగా ఓ టీమిండియా స్టార్ ఆటగాడి బ్యాటింగ్ చూసిన అభిమానులు.. అతన్ని టీ20 ప్రపంచకప్ జట్టులోకి తీసుకోనందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే మీకు అర్ధం అయి ఉంటుంది అతనెవరో. అతనే లక్నో జెయింట్స్ కెప్టెన్ కే ఎల్ రాహుల్. మామూలుగానే టీ20 అంటే దుమ్ము లేపే ఆట. ఫోర్లు, సిక్సులు కొడుతూ వేగంగా పరుగులు తీస్తేనే ఇందులో వాల్యూ, మజా ఉంటుంది. మరోవైపు ప్రతీ టీమ్‌లోనూ ప్రతీ ఆటగాడూ విజృంభించి ఆడుతుననారు. బౌలర్లు కూడా రెచ్చిపోయి షాట్లు కొడుతున్నారు. కానీ మనోడు కె ఎల్ రాహుల్ మాత్రం ప్రతీ మ్యాచ్‌లోనూ జిడ్డాడుతూ..క్రికెట్ లవర్స్ సహనానికి పరీక్ష పెడుతున్నాడు. ఒక రకంగా చాలా విసుగు తెప్పిస్తున్నాడు. నిన్నటి మ్యాచ్ హైదరాబాద్ సన్‌రైజర్స్, లక్నో జెయింట్స్...ఇరు జట్లకూ చాలా కీలకమైనది. ప్లే ఆఫ్స్‌కు వెళ్ళాలంటే గెలిచి తీరాల్సిన మ్యాచ్. లక్నో టీమ్‌లో మంచి ఆటగాళ్లకు కొదవ లేదు. అవకాశమిస్తే వాళ్ళు కూడా భారీ స్కోర్లు చేయగలరు. కానీ ఆ టీమ్ కెప్టెన్ ఆ ఛాన్స్ ఇవ్వాలి కదా. ముందే తాను బ్యాటింగ్‌కు దిగిపోయి...చివర వరకూ స్కోరు కొట్టకుండా, ఆవుట్ ఆవ్వకుండా జిడ్డుకుంటూ ఆడితే..ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు. అలాంటి టీమ్ ఓడిపోకుండా ఏమవుతుంది. నిననటి మ్యాచ్ ఓడిపోవడానికి వందశాతం కారణం కే ఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ 33 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 29 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 87.88. ఆఖర్లో ఆయుష్ బదోని, పూరన్ సూపర్ బ్యాటింగ్ తో మంచి స్కోరు సాధించింది లక్నో. లేదంటే.. నామమాత్రపు స్కోరుకు పరిమితమై ఉండేది. ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన కేఎల్ రాహుల్ ఇప్పటి వరకు కేవలం 460 పరుగులు మాత్రమే చేశాడు. దీన్ని బట్టి ఎవరికైనా అర్ధం అవుతుంది. అతను ఎంత ఘోరంగా జిడ్డులా సాగుతున్నాడో. ఈ స్కోర్లు, ఆట చూసే హమ్మయ్య ఇతన్ని టీ20 వరల్డ్‌కప్‌కు సెలక్ట్ చేయకుండా మంచి పని చేవారు అంటూ క్రికెట్ అభిమానులు తెగ హ్యాపీగా ఫీలవుతున్నారు. కెప్టెన్ అలా..ఓనర్ ఇంకోలా... నిన్నటి మ్యాచ్‌లో ఇంకో హైలెట్..లక్నో జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయెంకా (Lucknow Owner Sanjiv Goenka) ప్రవర్తన. నిన్న మ్యాచ్ అయ్యాక గోయెంకా కెప్టెన్ రాహుల్ మీద బహిరంగంగానే విరుచుకుపడ్డాడు. చాలాసేపు అతని మీద అరిచాడు. ఓనర్‌గా గోయెంకా ఫ్రస్ట్రేషన్ అర్ధం చేసుకోదగినదే. అతనికి కోపం రావడంలోనూ తప్పులేదు. కానీ గ్రౌండ్‌లోనే , కెమెరాల ఎదురుగా చేయడమే బాలేదు అని అంటున్నారు అభిమానులు. కెప్టెన్‌గా కె ఎల్ రాహుల్ ఫెయిల్ అయ్యాడు, ఆడటం లేదు. అంతా కరెక్టే కానీ..ఆ తిట్టడం ఏదో లోపల డ్రెస్సింగ్ రూమ్‌లో చేసుకోవచ్చు కదా అంటున్నారు. పైగా ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో చాలా వైరల్ కూడా అయిపోయింది. దీంతో ఎంత టీమ్ ఓనర్ అయితే మాత్రం టీమ్ ప్లేయర్‌ను ఇలానే ట్రీట్ చేస్తారా అంటూ క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గోయెంకా ఇంతకు ముందు కూడా ఇలానే చేశాడు ఒకటి, రెండు సార్లు...ఇదేమీ మంచి పద్ధతి కాదంటూ తిడుతున్నారు. This is just pathetic from @LucknowIPL owner Never saw SRH management with players on the field or even closer to dressing room irrespective of so many bad seasons and still face lot of wrath for getting involved. Just look at this @klrahul leave this shit next year #SRHvsLSG pic.twitter.com/6NlAvHMCjJ — SRI (@srikant5333) May 8, 2024 Also Read:Sam Pitroda: శామ్ పిట్రోడా వివాదస్పద వ్యాఖ్యలు దుమారం.. అసలు ఎవరీయనా ? #hyderabad #cricket #lucknow #ipl-2024 #srh #lsg #kl-rahul మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి