Who is Sam Pitroda?: శామ్ పిట్రోడా.. దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు.. దక్షిణాదివారిని ఆఫ్రికన్లతో పోల్చిన ఈ కాంగ్రెస్ నేతపై సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు వచ్చాయి. అందుకే కాంగ్రెస్ ఓవర్సీస్ చైర్మన్ శామ్ పిట్రోడా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే శామ్ పిట్రోడాకు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్త కాదు.. గతంలోనూ ఆయన చేసిన కామెంట్స్ కాంగ్రెస్ను ఇరాకటంలో పడేశాయి.. ఇంతకి ఎవరీ శామ్ పిట్రోడా.. గాంధీ కుటుంబంతో ఆయనకున్న సంబంధం ఏంటి? గతంలో ఆయన చేసిన కాంట్రవర్శి కామెంట్స్ ఏంటి లాంటి విషయాలను తెలుసుకుందాం!
Sam Pitroda: శామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం.. అసలు ఎవరీయన ?
ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ శామ్ పెట్రోడా తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఒడిశాకు చెందిన ఆయన ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, యూపీఏ ప్రభుత్వ హయాంలో వివిధ హోదాల్లో పనిచేశారు.1992లో ఐక్యరాజ్యసమితిలో కూడా పనిచేశారు.
Translate this News: