/rtv/media/media_files/2025/12/19/bangladesh-student-protests-leader-osman-hadi-dies-in-a-singapore-hospital-2025-12-19-17-00-06.jpg)
Bangladesh student protests leader Osman Hadi dies in a Singapore hospital
బంగ్లాదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన యువ నేత షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ(Osman Hadi death) మరణంతో ఆ దేశం అట్టుడుకుతోంది. భారత వ్యతిరేకిగా, షేక్ హసీనా ప్రభుత్వ పతనంలో కీలక పాత్ర పోషించిన నేతగా గుర్తింపు పొందిన హాదీ.. తుపాకీ కాల్పుల గాయాలతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ హాదీ(muhammad yunus bangladesh)కి ఘన నివాళులర్పించారు.
Also Read : ఉష్ణోగ్రతల్లో పదేళ్ల రికార్డు.. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్
Yunus Described The Death Of Osman Hadi
ఉస్మాన్ హాదీ మరణం దేశానికి తీరని లోటని యూనస్ అభివర్ణించారు. "హాదీ.. నీవు ఎప్పటికీ మా గుండెల్లోనే ఉంటావు. నిన్ను ఈ దేశం ఎన్నటికీ మర్చిపోదు. బంగ్లాదేశ్ ఉన్నంత కాలం నీ జ్ఞాపకాలు సజీవంగా ఉంటాయి" అని భావోద్వేగంగా పేర్కొన్నారు. హాదీ ఎంచుకున్న లక్ష్యాలను, ఆయన ఆశయాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని యూనస్ ప్రతిజ్ఞ చేశారు. ఫాసిజం, ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా హాదీ సాగించిన పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. హాదీ గౌరవార్థం శనివారం (డిసెంబర్ 20) నాడు బంగ్లాదేశ్ ప్రభుత్వం జాతీయ సంతాప దినం ప్రకటించింది. ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను సగం వరకు ఎగురవేయాలని ఆదేశించింది.
'ఇంక్విలాబ్ మంచ్' సంస్థ కన్వీనర్‌గా ఉన్న 32 ఏళ్ల ఉస్మాన్ హాదీపై డిసెంబర్ 12న ఢాకాలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. తలలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో పరిస్థితి విషమించింది. మెరుగైన వైద్యం కోసం సింగపూర్‌కు తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆయన మరణించారు. హాదీ మరణవార్త తెలియగానే బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనలు మిన్నంటాయి. భారత్‌కు మద్దతుగా ఉన్నాయని ఆరోపిస్తూ 'ప్రోథోమ్ అలో', 'డైలీ స్టార్' వంటి ప్రముఖ మీడియా కార్యాలయాలకు నిరసనకారులు నిప్పు పెట్టారు. చిట్టగాంగ్‌లోని భారత అసిస్టెంట్ హైకమిషన్ నివాసంపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. హాదీ హత్య వెనుక కుట్ర ఉందని, నిందితులు భారత్‌కు పారిపోయారని వారు ఆరోపిస్తున్నారు. 2026 ఫిబ్రవరిలో జరగబోయే సాధారణ ఎన్నికల్లో ఢాకా-8 నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు హాదీ సిద్ధమయ్యారు. ఆయన మరణం యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వానికి మరియు భారత్-బంగ్లా సంబంధాలకు మధ్య తీవ్ర ఉద్రిక్తతలను పెంచింది.
Also Read : చైనాకు చుక్కలు చూపించనున్న ఏపీ.. పాకిస్థాన్‌కు ఇక వణుకే
Follow Us