టిబెట్‌లోని షీగాజే డింగ్రి కౌంటీలో నిన్న ఉదయం 9.05 గంటలకు భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గానమోదైంది. వరుసగా ఆరుసార్లు భూమి కంపించింది. దీని తాకిడికి 126 మంది పౌరులు మరణించారు. మరో 188 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భూకంపం కారణంగా చాలా ఆస్తి నష్టం కూడా సంభవించింది. చాలా భవనాలు నేలమట్టం అయ్యాయి. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో చైనా భూకంప నిర్వహణ విభాగం సహాయక చర్యలను ప్రారంభించింది. షీజాగే ప్రాంతంలో 1500 వందలకు పైగా స్థానిక సిబ్బంది రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. Also Read: ISRO: ఇస్రో తదుపరి ఛైర్మన్ వి. నారాయణన్ భూమికి 10 కి.మీ లోతులో.. నేపాల్‌లో ఉన్న ఖబు హిమాలయాల్లో భూకంపం వచ్చినట్లు గుర్తించారు. అక్కడి లబుసేకు ఈశాన్యంగా ఉన్న డింగ్రీ కౌంటీకి చెందిన త్సోగో టౌన్‌షిప్ ను కేంద్రంగా ఇది ఏర్పడిందని చెబుతున్నారు. భమిలోపల 10 కి.మీ అడుగన ఇది సంభవించింది. ఈ భూకంప ప్రభావం భారత్‌లోని పలు రాష్ట్రాలపై పడింది. ఢిల్లీలతో పాటు బిహార్‌లోని మోతిహారి, సమస్తిపూర్, దర్భంగా, మధుబని, పూర్నియా, సివాన్, అరారియా, సుపాల్, ముజఫర్‌పూర్‌లోని పలు జిల్లాల్లో ఉదయం 6.40 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. పశ్చిమ బెంగాల్, అస్సాం సహా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా భూమి కంపించింది. Also Read: AP: ఆంధ్రాకు నేడు ప్రధాని మోదీ.. కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం