భారతీయులకు ట్రంప్ సర్కార్ మరో షాక్.. ‘వారికే మొదట వీసా’

లాటరీ పద్ధతికి బదులుగా, ఇకపై అధిక వేతనం, అత్యున్నత నైపుణ్యం ఉన్నవారికే ప్రాధాన్యతనిచ్చే 'వెయిటెడ్ సెలక్షన్' విధానాన్ని అమెరికా అమలు చేయనుంది. ఆ విధానానికి సంబంధించిన మార్గదర్శకాలు, నిబంధనలను US డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ విడుదల చేసింది.

New Update
H1B and Green Card visa rules

అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే భారతీయ టెక్కీలకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న హెచ్-1బి (H-1B) వీసా లాటరీ విధానాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అదృష్టంపై ఆధారపడే లాటరీ పద్ధతికి బదులుగా, ఇకపై కేవలం అధిక వేతనం, అత్యున్నత నైపుణ్యం ఉన్నవారికే ప్రాధాన్యతనిచ్చే 'వెయిటెడ్ సెలక్షన్' విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఆ విధానానికి సంబంధించిన మార్గదర్శకాలు, నిబంధనలను యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ తాజాగా విడుదల చేసింది. కొత్త విధానం 2026 ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి వస్తుందని.. 2027 ఆర్థిక సంవత్సరం (2026 సెప్టెంబరు 27 నుంచి 2027 సెప్టెంబరు 25 వరకూ ఉండే) హెచ్‌-1బీ వీసా కోటా నమోదు సీజన్‌కు వర్తిస్తుందని వివరించింది. అంటే.. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి హెచ్‌-1బీ వీసాల ఎంపిక ప్రక్రియ ఈ కొత్త విధానం ప్రకారం జరుగుతుందన్నమాట. మొత్తం వీసాల కోటా (85,000)లో ఎలాంటి మార్పు లేనప్పటికీ, ఎంపిక ప్రక్రియ మాత్రం పూర్తిగా మారిపోయింది.

లాటరీకి స్వస్తి.. వేతనానికే ప్రియారిటీ

ఇప్పటివరకు వీసా దరఖాస్తులు పరిమితి కంటే ఎక్కువ వస్తే కంప్యూటర్ లాటరీ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసేవారు. కానీ కొత్త నిబంధన ప్రకారం, ఏ అభ్యర్థికి అయితే కంపెనీ ఎక్కువ జీతం ఇస్తుందో, వారికే వీసా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అమెరికన్ల ఉద్యోగాలను తక్కువ జీతానికి విదేశీయులకు కట్టబెట్టకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ యంత్రాంగం తెలిపింది.

ఎంపిక విధానం 

కొత్త విధానంలో అక్కడ ఉద్యోగుల సాలరీ స్థాయిలను బట్టి అప్లికేషన్లకు వెయిటేజీ ఇస్తారు. 
లెవల్ 4 (అత్యధిక వేతనం): వీరి అప్లికేషన్లు ఎంపిక పూల్‌లో 4 సార్లు పరిగణించబడతాయి. వీరికి వీసా వచ్చే అవకాశం 100% కంటే ఎక్కువగా పెరుగుతుంది.
లెవల్ 1 (ప్రారంభ స్థాయి వేతనం): వీరి అప్లికేషన్ కేవలం ఒక్కసారి మాత్రమే పరిగణించబడుతుంది. దీనివల్ల ఫ్రెషర్లు లేదా తక్కువ జీతం పొందే వారికి వీసా రావడం దాదాపు అసాధ్యం అవుతుంది.

భారతీయులపై ప్రభావం

భారతీయ ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు సాధారణంగా భారీ సంఖ్యలో మధ్యస్థాయి లేదా ఎంట్రీ లెవల్ ఉద్యోగులను అమెరికాకు పంపిస్తుంటాయి. తాజా మార్పుల వల్ల ఈ కంపెనీలపై ఆర్థిక భారం పెరగడమే కాకుండా, వీసాల సంఖ్య కూడా తగ్గే ప్రమాదం ఉంది. ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం కొత్త హెచ్-1బి వీసాలపై 1 లక్ష డాలర్ల (సుమారు రూ. 88 లక్షలు) అదనపు ఫీజును విధిస్తూ తీసుకున్న నిర్ణయం పెను దుమారం రేపింది.

Advertisment
తాజా కథనాలు