/rtv/media/media_files/2025/12/07/trudeau-2025-12-07-10-41-45.jpg)
కెనడా ప్రధానిగా గద్దె దిగిన తర్వాత కూడా జస్టిన్ ట్రూడో వార్తల్లో టాపిక్ అయ్యారు. దానికి కారణం ఆయనకు పాప్ స్టార్ కేటీ పెర్రీతో ఉన్న సంబంధం. వీరిద్దరూ కలిసి తరుచుగా కనిపిస్తుండడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కూడా చాలా బయటకు వచ్చాయి. అయితే ఇన్నాళ్ళు ట్రూడో కానీ, కేటీ పెర్రీ కానీ దీని గురించి ఎక్కడా నోరు విప్పలేదు. అలా అని ఖండించలేదు కూడా. కానీ తాజాగా ట్రూడో, పెర్రీ ఇద్దరూ కూడా తమ సంబంధం గురించి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. రెండు రోజులు క్రితం జపాన్ పర్యటన ఫోటోలను మాజీ ప్రధాని పోస్ట్ చేయగా...ఈరోజు కేటీ ఇద్దరు కలిసి కూర్చుని ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది.
అఫీషియల్ పోస్ట్..
రెండు రోజులు క్రితం ట్రూడో , కేటీ పెర్రీతో కలిసి జపాన్ సర్యటనకు వెళ్ళారు. అక్కడ ఆ దేశ ప్రధాని ఫ్యుమియో కిషిదాను కలిసి విందులో పాల్గొన్నారు. దీనికి సంబంధించి కిషిదానే ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ట్రూడో తన భాగస్వామి పెర్రీతో కలిసి జపాన్‌ను సందర్శించారు. మాతో కలిసి భోజనం చేశారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు.. దేశాల అధినేతలుగా మేము అనేకసార్లు కలిశాము. అప్పుడు ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి మేం కలిసి పనిచేశామని రాశారు. ట్రూడో, పెర్రీతో కలిసి దిగిన ఫోటోను కూడా పెట్టారు. కిషిదా ఇదంతా ాయన అనుమతి లేకుండా చెప్పరు కదా. పైగా ఆమె పోస్ట్ ను ట్రూడో కూడా రీపోస్ట్ చేశారు. దీంతో కేటీ పెర్రీతో ఉన్న సంబంధాన్ని ఆయన అఫీషియల్ గా చెప్పినట్టు అయింది.
ఇక కేటీ పెర్రీ కూడా ఈరోజు దీనికి సంబంధించి ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. ఇది కూడా జపాన్ టూర్ కు సంబంధించిన ఫోటోలే. అందులో ట్రూడో, పెర్రీ కలిసి భోజనం చేస్తున్నవి, సెల్ఫీ ఫోజులు ఉన్నాయి. దీనికి ఆమె టోక్యో టైమ్స్ ఆన్ టూర్ క్యాప్షన్ ఇచ్చింది.
ఈ ఏడాది జనవరిలో జస్టిన్ ట్రూడో కెనడా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత పెర్రీ , ట్రూడో అక్టోబర్ 25న పారిస్‌లో గాయకుడి 41వ పుట్టినరోజు సందర్భంగా జంటగా మొదటిసారిగా బహిరంగంగా కనిపించారు. కాలిఫోర్నియాలోని శాంటా బార్బరా తీరంలో పెర్రీతో ఒక నౌకపై విహరిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అందులో చొక్కా లేకుండా ఉన్న ట్రూడో...స్విమ్ సూట్ లో ఉన్న పెర్రీని కిస్ చేస్తున్నట్లు అందులో ఉంది. అంతకు ముందు జులైలో మొదటి సారిగా ట్రూడో, పెర్రీలు డేటింగ్ చేస్తున్నట్లు బయటకు వచ్చింది. మొదటి సారిగా వీరిద్దరూ మాంట్రియల్ లోని ఓ రెస్టారెంట్ లో కలిసి కనిపించారు. అక్కడ ఇద్దరూ రెండు గంటలపాటూ గడిపారు. అప్పటి నుంచీ వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం మొదలైంది.
Follow Us